Benefits of Eating Oats: టైప్ 2 డయాబెటిస్‌ పేషెంట్స్ ఈ ఆహారం తింటే బ్లడ్‌లో షుగర్ లెవెల్ తగ్గుతాయి..!!

Benefits of Eating Oats: మారుతున్న జీవన శైలి కారణంగా చాలా మంది టైప్ 2 డయాబెటిస్‌కు గురవుతున్నారు. ఇది శరీరంలో ఉండే  ఇన్సులిన్ స్థాయిని ప్రభావితం చేస్తుంది. అంతే కాకుండా జీవక్రియ వ్యవస్థను నాశనం చేస్తుంది. ఈ క్రమంలో టైప్ 2 డయాబెటిస్‌ వ్యాధిగ్రస్తులు తప్పకుండా ఆహారంపై శ్రద్ధ వహించాలని వైద్య నిపుణులు తెలుపుతున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : May 27, 2022, 10:09 AM IST
  • టైప్ 2 డయాబెటిస్‌ పేషెంట్స్‌కు మంచి ఆహారం
  • ఓట్స్ తినడం వల్ల శరీరానికి చాలా ప్రయోజనాలు
  • ఓట్స్ తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరగదు
Benefits of Eating Oats: టైప్ 2 డయాబెటిస్‌ పేషెంట్స్ ఈ ఆహారం తింటే బ్లడ్‌లో షుగర్ లెవెల్ తగ్గుతాయి..!!

Benefits of Eating Oats: మారుతున్న జీవన శైలి కారణంగా చాలా మంది టైప్ 2 డయాబెటిస్‌కు గురవుతున్నారు. ఇది శరీరంలో ఉండే  ఇన్సులిన్ స్థాయిని ప్రభావితం చేస్తుంది. అంతే కాకుండా జీవక్రియ వ్యవస్థను నాశనం చేస్తుంది. ఈ క్రమంలో టైప్ 2 డయాబెటిస్‌ వ్యాధిగ్రస్తులు తప్పకుండా ఆహారంపై శ్రద్ధ వహించాలని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే రక్తంలో చక్కెర స్థాయి పెరిగి అనేక రకాల శరీర సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి.

టైప్ 2 డయాబెటిస్‌ రోగులు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి:

టైప్ 2 డయాబెటీస్ రోగులు తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్ అధికంగా ఉండేటట్లు చూసుకోవాలి. ఈ  కార్బోహైడ్రేట్  రక్తంలో చక్కెర స్థాయిని ప్రభావితం చేస్తాయి. అంతేకాకుండా ఫైబర్ వంటి పోషకాలను కలిగి ఆహారాన్ని కూడా తిసుకుంటే మంచిదని వైద్య నిపుణులు పేర్కొన్నారు. ఆహారాల్లో చక్కెర కంటెంట్, కొవ్వు పరిమాణం చాలా తక్కువగా ఉన్న వాటిని తినాలని చెబుతున్నారు. టైప్ 2 డయాబెటిస్‌ రోగులు ఆరోగ్యకరంగా ఉండేందుకు  ఓట్స్ తినడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

టైప్ 2 డయాబెటిస్‌లో ఓట్స్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు:

1. డయాబెటిక్ రోగులకు ఓట్స్ లేదా ఓట్ మీల్ సరైన ఆహారమని నిపుణులు తెలుపుతున్నారు.
2. ఇది హోల్‌గ్రెయిన్ ఫుడ్, ఇందులో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి.
3. ఓట్స్ తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరగదు.
4. గ్లూకోజ్‌ను నెమ్మదిగా విడుదల చేస్తుంది.
5. పరిశోధన ప్రకారం..100 గ్రాముల ఓట్స్‌లో దాదాపు 68 కేలరీలు, 21 గ్రాముల ఫైబర్ ఉంటుంది
6. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఎక్కువ కాలం శక్తిని ఇస్తుంది.
8. ఆకలిని తగ్గిస్తుంది. అందుకే బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది.
9. ఓట్స్‌లో కేలరీలు, నూనెలు ఉండవు, కావున జీర్ణక్రియలో సమస్యలను తగ్గిస్తుంది.

ఓట్స్ ఎలా తీసుకోవాలి?:

ఓట్స్ తయారుచేయడం చాలా సులభం. దీనిని వండడం కోసం ముందుగా వేడి నీటిలో ఓట్స్ పౌడర్ మిక్స్ చేయాలి. ప్రస్తుతం చాలా మంది రోటీ తయారిలో ఓట్స్‌ను వాడుతున్నారు.  అయితే ఓట్స్‌ రోటీల వినియోగాల కూడా ఘననీయంగా పెరిగింది.  ఈ రోటీ శరీర బరువును తగ్గించి..ఆహారం సులభంగా జీర్ణమయ్యేట్లు చేస్తుంది. ఈ రోటీ చేయడానికి ముందుగా ఒక కప్పు ఓట్స్ పౌడర్, ఒక కప్పు గోధుమ పిండి, ఒక చెంచా తరిగిన కొత్తిమీర తరుగు, అరకప్పు తరిగిన ఉల్లిపాయ తీసుకోవాలి. ఇప్పుడు పిండిని సిద్ధం చేయండి.

(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

Also Read: Lychee Benefits: వేసవిలో లీచీ పండ్లు తినడం వల్ల శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?

Also Read: Flaxseed Raita: అవిసె గింజల రైతా..దీని వల్ల శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News