How To Control Diabetes: నువ్వుల నూనె ప్రయోజనాలు! మధుమేహం, కీళ్ల నొప్పులు ఉన్నవారు తింటే కలిగే లాభాలు ఇవే!
Is Sesame Oil Good For Diabetes: నువ్వుల నూనె వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు మధుమేహంతో పాటు దీర్ఘకాలిక వ్యాధులను తగ్గించేందుకు కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి దీనిని ఎలా వినియోగిస్తే మంచి ఫలితాలు పొందుతారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Is Sesame Oil Good For Diabetes: అతిగా నూనె కలిగిన ఆహారాలు తీసుకోవడం వల్ల చాలా మందిలో తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. అయితే కొందరు దీని కారణంగా బరువు పెరిగితే మరికొందరిలో రక్తంలోని చక్కెర పరిమాణాలు పెరుగుతున్నాయి. కాబట్టి మధుమేహంతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా జీవనశైలిలో మార్పులు కూడా చేసుకోవాల్సి ఉంటుంది లేకపోతే ప్రాణాంతకంగా మారే అవకాశాలు ఉన్నాయి. అయితే చాలామంది డయాబెటిస్ ఉన్నవారు మార్కెట్లో లభించే చెడు కొలెస్ట్రాల్ కలిగిన నూనె ఎక్కువగా వినియోగిస్తున్నారు. దీనివల్ల తీవ్ర అనారోగ్య సమస్యలే కాకుండా చక్కర పరిమాణాలు కూడా ఒక్కసారిగా పెరిగిపోతున్నాయి. కాబట్టి ఈ వ్యాధితో బాధపడుతున్న వారు నువ్వుల నూనె వినియోగించడం వల్ల మంచి ప్రయోజనాలు పొందుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నువ్వుల నూనెను ఆహార పదార్థాల తయారీలో వినియోగించడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
నువ్వుల నూనెను ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలు:
గుండె ఆరోగ్యంగా ఉంటుంది:
నువ్వుల నూనెలో గుండె ఆరోగ్యానికి మేలు చేసే చాలా రకాల పోషకాలు లభిస్తాయి. కాబట్టి ఎక్కువగా ఆహారాల్లో వినియోగించడం వల్ల శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పరిమాణాలు పెరిగి.. చెడు కొలెస్ట్రాల్ పరిమాణాలు తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నువ్వుల నూనెలో ఒమేగా -3, ఒమేగా -9 పోషకాలు లభిస్తాయి. కాబట్టి గుండెను అనారోగ్య సమస్యల నుంచి కాపాడేందుకు కీలక పాత్ర పోషిస్తాయి..
వాపు:
వాపులు, ఇళ్ల నొప్పులు, ఇతర నొప్పులతో బాధపడేవారు ప్రభావిత ప్రదేశాల్లో నువ్వుల నూనెతో మసాజ్ చేయడం వల్ల సులభంగా ఉపశమనం లభిస్తుంది. కాబట్టి తరచుగా కీళ్లనొప్పుల సమస్యలతో బాధపడుతున్న వారు ఈ చిట్కాను వినియోగించడం వలన న్యాచురల్ గా ఉపశమనం పొందుతారు. ఇక వాపుల సమస్యలతో బాధపడుతున్న వారు ఈ నూనెను వాపు ఉన్న ప్రదేశాల్లో అప్లై చేస్తే త్వరలోనే మంచి ఫలితం పొందుతారు.
మధుమేహం:
మధుమేహం చాలా ప్రమాదకరమైన వ్యాధి ఒక్కసారి ఈ వ్యాధి బారిన పడితే అది జీవితాంతం మిమ్మల్ని నిద్రపోనియ్యకుండా చేస్తుంది. మధుమేహం కారణంగా చాలామందిలో రక్త పోటు సమస్యలు కూడా వస్తున్నాయి కాబట్టి ఈ వ్యాధి నుంచి ఎంత తొందరగా ఉపశమనం పొందితే అంత మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి రక్తంలో చక్కెర పరిమాణాలను నియంత్రించుకోవడానికి తప్పకుండా నువ్వుల నూనెతో తయారు చేసిన ఆహారాలను మాత్రమే తినాల్సి ఉంటుంది
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: Dasara Collection : దసరా ఊచకోత.. అక్కడ కూడా బ్రేక్ ఈవెన్?.. నాని దెబ్బకు బాక్సాఫీస్ బద్దల్
Also Read: Janhvi Kapoor Pics : అందాలను ఒడిసిపట్టినట్టుగా.. కాక పుట్టించేలా జాన్వీ కపూర్ లుక్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook