Loose Weight with Rose Petals: అధికంగా ఉన్న శరీర బరువును తగ్గించుకోవటం చాలా కష్టమనే చెప్పవచ్చు, కొన్ని రకాల ఔషదాల ద్వారా శరీర బరువు సులభంగా తగిన్చుకోవచ్చు. గులాభి రేకులను ద్వారా కూడా శరీరంలో ఉన్న బరువును తగ్గించుకొని, మంచి ఆకృతిని పొందవచ్చు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భారతదేశపు సాంప్రదాయంలో గులాభి రేకులు ఒక భాగమే. ఇవి యాంటీ సెప్టిక్ గుణాలను మరియు యాంటీ ఫంగల్ గుణాలను కలిగి ఉంటాయి.  మనకు తెలిసి వీటిని ఎక్కువగా ఫంక్షన్ లలో అలంకారణకు వాడుతుంటారు. 


Also Read: Poonch Encounter: జమ్మూకాశ్మీర్‌లో మళ్లీ కాల్పులు.. గాయపడ్డ జవాన్, ఇద్దరు పోలీసులు


అంతేకాకుండా, గులాభి రేకులలో మొటిమలు మరియు నల్లటి మచ్చలను తొలగించే పదార్థాలు ఉంటాయి. ఈ అద్భుతమైన ప్రయోజనాలతో పాటుగా, గులాభి రేకులు లాక్సైటీవ్ మరియు డైయూరేటిక్ గుణాలను కూడా కలిగి ఉంటాయి. ఈ లక్షణాలు, పొట్ట చుట్టూ ఉన్న కొవ్వును తగ్గించటమే కాకుండా, శరీరంలో ఉండే హానికర పదార్థాలను తొలగించి, జీవక్రియ మరియు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ఈ చర్యల ఫలితంగా శరీర బరువు కూడా తగ్గుతుంది.


దాల్చిన చెక్క పొడిని, గులాభి రేకులతో కలపటం వలన, జీర్ణక్రియ మెరుగుపడి, శరీరంలోని అధిక కొవ్వు పదార్థాల స్థాయిలు తగ్గించబడతాయి. 


Also Read: India vs Pakistan: 'మేము ప్రొఫెషనల్స్': విరాట్ Vs 'గతం గతహా': బాబర్.. Press Meet


గులాభి రేకులను ఎలా వాడటం
దాదాపు 10 నుండి 15 తాజా గులాభి రేకులను తీసుకొని, స్టవ్ పై మరిగించే నీటిలో వేసి, వేడి చేయండి. నీరు గులాభి రంగులోకి మారే వరకు వేడి చేయండి. ఈ మిశ్రమానికి కొద్దిగా దాల్చిన చెక్క పొడిని మరియు తేనెను, కావలసిన రుచి మేరకు కలపండి. బరువు తగ్గటానికి కావసిన ఆద్భుత ద్రావణం సిద్దం అయింది. ఈ రకమైన హెర్బల్ టీని రోజు రోజు తాగి, కొద్ది రోజుల తరువాత కలిగే మార్పులను గమనిచండి.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook