India vs Pakistan: 'మేము ప్రొఫెషనల్స్': విరాట్ Vs 'గతం గతహా': బాబర్.. Press Meet

భారత్- పాకిస్తాన్ జట్ల మధ్య జరగనున్న హై ఓల్టేజ్ మ్యాచ్‌కు సర్వం సిద్ధమైంది. మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో ఇరు జట్ల కెప్టెన్ లు మీడియాతో మాట్లాడుతూ ఏమన్నారంటే..??

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 24, 2021, 12:08 PM IST
  • ఆదివారం నాడు జరగనున్న హై ఓల్టేజ్ మ్యాచ్‌కు సర్వం సిద్ధం
  • మేము ప్రొఫెషనల్ క్రికెటర్స్.. అన్ని మ్యాచ్‌ల లాగానే ఇది కూడా: విరాట్
  • గతం గతహా.. ఈ సారి విజయ మాదే అంటున్న: బాబర్ అజమ్
India vs Pakistan: 'మేము ప్రొఫెషనల్స్': విరాట్ Vs 'గతం గతహా': బాబర్.. Press Meet

India Vs Pakistan in T20 World Cup 2021: ఎన్నో కోట్ల మంది ఆసక్తికరంగా ఎదురుస్తున్న ఆ రోజు రానే వచ్చింది. ఈ రోజు సాయంత్రం దుబాయ్​ వేదికగా జరగున్న టీ20 వరల్డ్ కప్ (T20 World Cup 2021) లో ఇండియా - పాకిస్తాన్ (India Vs Pakistan) జట్లు తలపడనున్నాయి.  

హై ఓల్టేజ్ తో కొనసాగే ఈ మ్యాచ్‌లో ఆధిపత్యం కోసం ఇరు జట్లు తహతహలాడుతున్నాయి, అన్ని విధాలా ప్రణాళికలు సిద్ధం చేసుకున్న ఈ జట్లు పోరు సిద్ధమయ్యాయి. టీ 20 వరల్డ్ కప్ 2021 లో ఇరు జట్లకు తొలి మ్యాచ్ కావటంతో.. ఇరు జట్ల కెప్టెన్లు మీడియాతో మాట్లాడారు.. ఎవరెను ఏమన్నారంటే..??

Also Read: UN Formation Day: ప్రపంచవ్యాప్తంగా ఘనంగా ఐక్యరాజ్యసమితి దినోత్సవం, విశేషాలివే

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ...
భారత్ ఇతర ఏ దేశాలతో ఆడిన లేని ఒత్తిడి పాకిస్తాన్ తో మ్యాచ్ అనగానే ఒత్తిడి స్థాయిలు పెరిగిపోతాయి, మ్యాచ్‌కు ముందు చాలా కామెంట్లు వినపడుతున్నాయి.. కానీ వాటిని మేము పట్టించుకోము.. ఇవన్నీ మామూలే.. మేము ప్రొఫెషనల్ క్రికెటర్స్.. ఇతర మ్యాచ్‌లానే ఇది కూడా ఒక మ్యాచ్ గా భావిస్తాము. మైదానంలో కూడా వాతావరణం భిన్నంగా ఉన్న మా మానసిక పరిస్థితి మామూలుగానే ఉంటుంది. ఇటీవలే ఐపీఎల్ ఆడిన మ్యాచ్‌ల వలన మంచి అనుభవంతో ఆటగాళ్లంతా ఉత్సాహంగా ఉన్నారు. ప్రతి ఒక్క ఆడటానికి తమ పాత్రలేంటో స్పష్టంగా తెలుసు.. తుడు జట్టు వివరాలు ఇపుడు ప్రకటించలేకపోతున్నాను.. కానీ మంచి సమతుల్యమైన జట్టుతో పాకిస్తాన్ తో జరిగే మ్యాచ్‌లో ఆడతాము... 

పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజామ్...
ఇప్పటి వరకు టీ 20 ప్రపంచకప్ లో ఇండియాను మేము ఓడించలేదు.. కానీ "అదంతా గతం.. ఈ సారి మేము చరిత్ర తిరగరాస్తాం". మా నైపుణ్యాన్ని, సామర్థ్యాలను ప్రదర్శించి, మ్యాచ్ గెలుస్తాము. ఇప్పటికే ప్రపంచ కప్ లలో భారత్ తో ఆడాము.. చాంపియన్స్ ట్రోఫీలో అత్యుత్తమ ప్రదర్శన చేసాము.. పరిస్థితులు ఎంత సాధారణంగా ఉంచితే.. అంత మాకే మంచిది. ప్రశాంతంగా ఉంటూ. ప్రరిస్థితులను సాధారణంగా ఉంచటం, ప్రాథమిక అంశాలపై దృష్టి సారిస్తాం. షోయబ్ స్పిన్ లో బాగా అడగలేదు అందుకే.. తుది జట్లు లో సర్పరాజ్ ను పక్కన బెట్టి అతడిని తీసుకున్నాం.. 

Also Read: TRS plenary : రేపు టీఆర్‌ఎస్‌ ప్లీనరీ.. హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు

హిస్టరీ... 
చివరగా భారత్- పాకిస్తాన్ జట్లు న్యూజిలాండ్‌లో (New Zealand) జరిగిన వరల్డ్‌ కప్‌లో (World Cup 2019) భాగంగా  జూన్‌ 16 2019 లో తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో భారత్ 89 రన్స్‌ తేడాతో పాకిస్తాన్ జట్టుపై గెలిచింది. దాదాపు రెండేళ్లుగా ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరగకపోవటం.. ఈ సారి తలపడటం... అది కూడా పొట్టి ప్రపంచకప్ (T20 World Cup)లో దాయాది దేశాల మధ్య సమరం జరగటం.. క్రికెట్ అభిమానులకు పండగే అని చెప్పాలి. 

ఇప్పటి వరకు ఇండియా - పాకిస్తాన్ జట్లు ఏడూ సార్లు ప్రపంచక‌ప్‌లో తలపడ్డాయి.. 5 మ్యాచ్‌లు టీ20 వరల్డ్ కప్ లు కాగా.. నాలుగు మ్యాచ్‌ల్లో భారత్ గెలుపొందగా.. ఒక మ్యాచ్ రద్దు అయింది. ప్రపంచక‌ప్‌లో ఏడూ సార్లు తడబడిన అన్ని మ్యాచుల్లో భారత్‌దే పై చేయిగా నిలిచింది. హిస్టరీ రిపీట్ అవుతుందా..?? లేక హిస్టరీని తిరగరాస్తారా తెలియాలంటే వేచి ఉండాల్సిందే.. !!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News