Winter Dry Skin Remedy: చలికాలంలో చర్మ సంరక్షణ ఎంతో అవసరం. మనలో చాలా మంది పొడి చర్మ సమస్య బారిన పడుతుంటారు. ఈ సమస్య కారణంగా చర్మం బలహీన పడుతుంది. అయితే చర్మం పొడి బారకుండా కొన్ని జాగ్రత్తలను తీసుకోవడం ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. చర్మం పొడి బారకుండా ఉండే చిట్కాలు ఇప్పుడు తెలుసుకుందాం.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తేనె-రోజ్ వాటర్‌: చలికాలంలో తేనె, రోజ్‌ వాటర్‌ ఉపయోగించడం వల్ల చర్మం పొడి బారకుండా ఉంటుందని చర్మ నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల చర్మానికి తేమనందిస్తుంది. పొడి చర్మంతో బాధపడతున్నవారు ఈ చిట్కాను ప్రతిరోజు ఉపయోగించడం వల్ల సమస్య నుంచి బయటపడవచ్చు.


గ్లిజరిన్-తేనె: కొంతమందిలో పెదవులు పగులుతుంటాయి. దీని వల్ల పెదవుల నుంచి రక్తం కూడా వచ్చే అవకాశం ఉంటుంది.  తేనెను, గ్లిజరిన్‌ ను కలిపి ఉపయోగించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఇలా చేయడం వల్ల పెదవులు తాజాగా కనిపిస్తాయి.


ఆలివ్ నూనె-నిమ్మ రసం: చలికాలంలో పాదాలు కూడా పగలడం కనిపిస్తుంది. దీని కోసం టేబుల్‌ స్పూన్‌ ఆలివ్‌ నూనె, అరచెంచా నిమ్మకాయ రసం కలిపి తీసుకోవడం వల్ల సమస్య నుంచి బయటపడవచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. 


నిమ్మ రసం-తేనె: నిమ్మ రస, తేనె కలిపి ముఖానికి, చేతులకూ రాసుకోవాలి. ఇలా చేయడంవల్ల చర్మం బిగుతుగా మారడమే కాకుండా దురద సమస్యలు రాకుండా ఉంటుంది.


Also Read  Radish Leaves: ముల్లంగి ఆకులతో కలిగే లాభాలు ఇవే!


కొబ్బరి లేద ఆలివ్ నూనె: చర్మం పొడి బారకుండా ఉండాలి అంటే స్నానాకి ముందు కొబ్బరి లేద ఆలివ్‌ నూనె రాసుకోవడం చాలా మంచిది. అలాగే శనగ పిండి, పసుపు, పాలు లేద పెరుగు కలిపి శరీరం మొత్తం మర్దన చేసుకోవడం వల్ల తేమ అందుతుంది.


చల్ల నీటితో స్నానం: చలికాలంలో వేడి నీళ్ల స్నానం కంటే చల్ల నీటి స్నానం ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. దీని వల్ల చర్మంలో ఉండే సహజ నూనెలు తొలగకుండా ఉంటాయి.


మాయిశ్చరైజ్‌: చలికాలంలో మాయిశ్చరైజ్‌లు వాడటం చాలా అవసరం.  మాయిశ్చరైజింగ్‌ వల్ల చర్మం తేమగా ఉండటంలో సహాయపడుతుంది.


సన్‌ స్క్రీన్‌ను వాడటం: బయట ఎక్కువగా తిరిగేవారు తప్పకుండా సన్‌ స్క్రీన్‌ ను ఉపయోగించాలి. ఇలా చేయడం వల్ల చర్మం సురక్షిత్తంగా ఉంటుంది.


జెల్ సబ్బులు: చలికాలంలో గ్లిజరిన్‌  సబ్బులు కంటే జెల్ సబ్బులు వాడితే మంచిదని చర్మ నిపుణులు చెబుతున్నారు. వీటిలో పిహెచ్‌ లెవల్స్‌ తక్కువగా ఉంటాయి.


ఈ విధంగా చలికాలంలో   మీ చర్మం పొడి బారకుండా ఉండాలి అంటే  ఈ  టిప్స్‌ను తప్పకుండా ఉపయోగించాలి.  దీనిని వల్ల  మీ చర్మం ఆరోగ్యంగా అలాగే పొడి  బారకుండా ఉంటుందని చర్మ నిపుణులు చెబుతున్నారు.


Also Read  Cucumber Benefits: కీర దోసకాయ తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter