Monkeypox Test Kit: కరోనా మహమ్మారి తరువాత ఇప్పుడు మంకీపాక్స్ ప్రపంచాన్ని భయపెడుతోంది. ఈ క్రమంలో మంకీపాక్స్ నిర్ధారణకై ఆర్టీపీసీఆర్ కిట్ లాంచ్ అయింది. ఈ కిట్ సహాయంతో..మంకీపాక్స్ నిర్ధారణ కేవలం 50 నిమిషాల్లోనే సాధ్యం కానుంది. ఆ కిట్ వివరాలు మీ కోసం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మంకీపాక్స్ ఇప్పుడు ప్రపంచంలో కలకలం రేపుతోంది. దేశంలో కూడా మంకీపాక్స్ లక్షణాలు వెలుగు చూడటంతో ఆందోళన పెరుగుతోంది. ఈ నేపధ్యంలో కరోనా వైరస్ నిర్ధారణకు చేసే ఆర్టీపీసీఆర్ లాంటి టెస్ట్ కిట్‌ను జీన్స్ 2 మి అనే కంపెనీ లాంచ్ చేసింది. మంకీపాక్స్ నిర్ధారణకు Genes2Me కంపెనీ అభివృద్ధి చేసిన ఆర్టీపీసీఆర్ టెస్ట్ కిట్ సహాయంతో కేవలం 50 నిమిషాల్లోనే నిర్ధారణ చేయవచ్చని కంపెనీ తెలిపింది. అంతేకాకుండా..POX-Q Multiplexed ఆర్టీపీసీఆర్ కిట్ ద్వారా హై ఫ్రీక్వెన్సీ రేట్‌తో ఫలితాలు వెల్లడి కానున్నాయని తెలిపింది. 


వారం రోజుల్లో 50 లక్షల టెస్ట్ కిట్స్


భవిష్యత్‌లో వారం రోజుల్లోనే 50 లక్షల టెస్ట్ కిట్స్ ఉత్పత్తి చేసే సామర్ధ్యం కంపెనీకు ఉందని జీన్స్ 2 మి కంపెనీ వ్యవస్థాపకులు నీరజ్ గుప్తా తెలిపారు. డిమాండ్ మేరకు రోజుకు 20 లక్షలు ఉత్పత్తి చేసే సామర్ధ్యానికి కూడా పెంచగలమన్నారు. ఇప్పటివరకూ 75 దేశాల్లో మంకీపాక్స్‌కు చెందిన 16 వేల కేసులు వెలుగుచూశాయి. ఇండియాలో ఇప్పటి వరకూ 4 కేసులు బయటపడ్డాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ వ్యాధిని ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. 


జీన్స్ 2 మి సంస్థ రూపొందించిన మంకీపాక్స్ నిర్ధారణ కిట్ రెండు వెర్షన్లలో అందుబాటులో ఉంటుంది. సాధారణంగా ఉపయోగించే ఆర్టీపీసీఆర్ పరికరంతో పాటు పాయింట్ ఆఫ్ కేర్ అంటే పీవోసీ ఫార్మట్‌లో కూడా లభ్యం కానుంది. పీవోసీ సొల్యూషన్ అనేది ఆసుపత్రులు, ఎయిర్‌పోర్ట్స్, డయాగ్నోస్టిక్ ల్యాబ్స్ వంటి ప్రాంతాల్లో స్క్రీనింగ్ కోసం ఉపయోగపడుతుంది. జీన్స్ 2 మి సంస్థ పరిశోధకులు..తమ టెస్ట్ కిట్ POX-Q ఆర్టీపీసీఆర్ కిట్‌ను మంకీపాక్స్ వైరస్ నిర్ధారణ నుంచి చికెన్ పాక్స్‌ను వేరు చేస్తూ చూపిస్తుంది. 


దేశంలో తొలి కంపెనీ


జీన్స్ 2మి సంస్థ అభివృద్ధి చేసిన మంకీపాక్స్ నిర్ధారణ కిట్ ఇండియాకు చెందిన తొలి టెస్ట్ కిట్ కావడం విశేషం. మంకీపాక్స్ నిర్ధారణ కోసం వెట్ అండ్ డ్రై రెండు రకాల స్వాబ్స్ సేకరించాల్సి ఉంటుంది. చెన్నైకు చెందిన ట్రివిట్రాన్ హెల్త్ కేర్ కంపెనీ కూడా మంకీపాక్స్ నిర్ధారణ కిట్ అభివృద్ధి చేసింది. ఈ కిట్ అయితే స్మాల్ పాక్స్, మంకీపాక్స్‌ల తేడా చూపిస్తూ ఫలితాల్ని ఇస్తుంది. 


Also read: Monsoon Diseases: వర్షాకాలంలో పొంచి ఉన్న వ్యాధులు, ఎలా రక్షించుకోవాలి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.