Sprouts Dosa Recipe: సాధారణంగా మనం మొలకెత్తిన గింజలను తీసుకుంటాము. దీని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది.అయితే చాలా మంది మొలకెత్తిన గింజలను నేరుగా తీసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడరు. అయితే దీని మీరు దోశలాగా తయారు చేసుకొని తినవచ్చే. ఇది ఎంతో రుచికరంగా ఉంటుంది. ఇది మామూలు దోశలాగా తయారు చేసుకొని తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.  ఇందులో అల్లం, పచ్చి మిర్చి, జీలకర్ర, కొత్తి మీర వేసి తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ దోశను ఎక్కువగా డయాబెటిస్‌ ఉన్నవారు తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. ఇందులో ఉండే అనేక రకాల పోషకాలు మన శరీరానికి ఎంతో ఉపయోగపడుతాయి. అంతేకాకుండా మొలకలు వచ్చాక వేసిన దోశ మరింత హెల్దీగా ఉంటుంది. 


కావలసిన పదార్థాలు:


మొలకెత్తిన పెసర గింజలు- 1 కప్పు 
మొలకెత్తిన మినపప్పు - ½ కప్పు
బియ్యం - ½ కప్పు 
ఉప్పు - రుచికి తగినంత 
జీలకర్ర - ½ tsp
మిరియాలు - ½ tsp
కరివేపాకు - కొన్ని 
నూనె  - 2 tbsp


తయారు చేసే విధానం :


మొదటగా పెసర గింజలు, మినపప్పులను 8-10 గంటల పాటు నానబెట్టాలి. తరువాత నీటిని తీసివేసి, మొలకెతిన గింజలను గుడ్డలో చుట్టి ఉంచాలి. మీరు బియ్యం వాడాలనుకుంటే వాటిని కూడా 30 నిమిషాలు నానబెట్టాలి. మొలకెత్తిన గింజలు, నానబెట్టిన బియ్యంలోకి  జీలకర్ర, మిరియాలు కలిపి మెత్తగా పిండిగా రుబ్బుకోవాలి.  పిండిలో కొద్దిగా బేకింగ్ సోడాను కలుపుకోవాలి. కానీ, ఇది ఎక్కువ అవసరం లేదు. ఈ  పిండిని తీసుకొని ఒక పైన్‌ మీద చిన్న చిన్న దోశలు వేసుకోవాలి. నూనెని ఉపయోగించి రెండు వైపులా క్లాచ్చుకోవాలి. ఈ విధంగా దోశలు తయారు చేసుకోవాలి. దీని ఎదైన పచ్చడితో కలిపి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. 


ఈ విధంగా మీరు కూడా ఈ దోశను తయారు చేసుకొని తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. కాబట్టి ఆరోగ్యానికి మేలు చేసే ఈ దోశను మీరు తప్పకుండా తయారు చేసుకోండి.


Also Read: Rooh Afza Recipe: వేడి వేసవికి చల్లని ఊరటని ఇచ్చే రూహ్ అఫ్జా షర్బత్



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter