Home Remedies for Periods:  పీరియడ్స్‌ ప్రతినెల మహిళల జీవితంలో వచ్చే ఒక నిరంతర ప్రక్రియ. కొంతమందిలో ఇది ఆలస్యం అవుతుంది. మరి కొంతమందికి ఇది నెలలో రెండుమార్లు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. పీరియడ్స్ ఆలస్యం అయినా కష్టమే, త్వరగా వచ్చినా కష్టమే. పీరియడ్స్‌ను ఆలస్యం చేయడానికి కొన్ని రెమిడీలు ఉన్నట్లే పీరియడ్స్‌ సరైన సమయానికి రావడానికి కూడా కొన్ని హోం రెమిడీస్‌ ఉన్నాయి.. అయితే, కొంతమంది మహిళలకు పీరియడ్స్‌ సరైన సమయానికి రావు. దీనికి రకరకాల కారణాలు ఉంటాయి. జెనిటిక్స్, మెడికల్ కండీషన్ కొన్ని లైఫ్‌స్టైల్ అలవాట్లు ప్రధాన కారణం కావచ్చు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఒక్కోసారి ప్రతి పీరియడ్ మధ్యలో గ్యాప్ రావచ్చు. పీరియడ్స్‌ ఆలస్యంగా వస్తే మూడ్‌ స్వింగ్‌, ఇతర ఆరోగ్య సమస్యలు కూడా మహిళల్లో కనిపిస్తాయి. అయితే, లైఫ్ స్టైల్‌లో కొన్ని మార్పులు చేసుకుంటే పీరియడ్స్ మిస్వవ్వకుండా ఉంటుంది.


కెరటైన్ ఫుడ్స్..
పీరియడ్స్‌ మిస్సవ్వకుండా ఉండాలంటే కొన్ని రకాల ఆహారాలు మన డైట్లో చేర్చుకోవాలి. ప్రధానంగా విటమిన్ సీ పుష్కలంగా ఉండే ఆహారాలు ఉండాలి. విటమిన్ సీ పుష్కలంగా ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల  హార్మోనల్‌ మార్పులు జరుగుతాయి. 


పార్ల్సీ..
పార్ల్సీ టీ లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఇందులో మైరిస్టిసిన్, అపియోల్ ఉంటుంది. ఇవి శరీరంలో  ఒయిస్ట్రోజెన్ ఉత్పత్తి చేస్తాయి. ఇది పూర్తిగా మెనుస్ట్రువల్ సైకిల్ పై ప్రభావం చూపుతుంది.


ఇదీ చదవండి: మెగ్నిషియం పుష్కలంగా ఉండే ఈ 10 ఆహారాలు మీ డైట్లో ఉన్నాయా? లేకపోతే నీరసం తప్పదు..


అల్లం..
పీరియడ్స్ మిస్సవ్వకుండా ఉండటానికి మరో ఎఫెక్టివ్ హోం రెమిడీ అల్లం. దీంతో పీరియడ్స్ సమస్యకు చెక్‌ పెట్టొచ్చు. అల్లం తీసుకోవడం వల్ల ఇది వాపు సమస్యను తగ్గిస్తుంది. హార్మనల్‌ సమతుల్యం చేస్తుంది.


బొప్పాయి..
పచ్చి బొప్పాయి కూడా పీరియడ్స్‌ సరైన సమయంలో రావడానికి సహాయపడుతుంది. ఇవి గర్భాశయంలో సంకోచాలను ప్రేరేపిస్తుంది. బొప్పాయిలో కెరోటిన్‌ కూడా పుష్కలంగా ఉంటుంది. దీంతో పీరియడ్స్ మిస్సవ్వకుండా సరైన టైంకి వచ్చే స్తుంది.


ఇదీ చదవండి:  మామిడాకులు ద్వారా మెరిసే చర్మం.. ఒత్తైన జుట్టు.. ఇంకా ఎన్నో లాభాలు


బెల్లం..
పీరియడ్స్ మిస్సవ్వకుండా సరైన సమయానికి రావాలంటే బెల్లం కూడా మరో ఎఫెక్టివ్ రెమిడీ. ఇందులో యాంటీ ఇన్ల్ఫమేటరీ , యాంటీస్పస్మోడిక్ గుణాలు ఉంటాయి. గర్భశయ తిమ్మిరిని కూడా బెల్లం తగ్గిస్తుంది. గోరువెచ్చని పాలలో బెల్లం వేసి తాగాలి. కావాలంటే ఇందులో నువ్వులను కూడా కలిపి తీసుకుంటే మంచిది. అంతేకాకుండా వేడి పాలు, వాము, పసుపు మూడు కలిపి కూడా రాత్రి పడుకునే ముందు తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల కూడా పీరియడ్స్ సరైన సమయానికి వస్తాయి. నిద్ర కూడా బాగా పడుతుంది(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter