Mango Leaves Benefits:
మావిడాకులు అనగానే మనకి గుర్తొచ్చేది తోరణాలు. ఏ పండగ అయినా మన ఇంటి గుమ్మానికి ప్రత్యక్షమైపోతూ ఉంటాయి. కేవలం గుమ్మానికి కట్టడం మాత్రమే కాకుండా.. మామిడి ఆకులకి ఇంకా ఎన్నో విశిష్టతలు ఉన్నాయి. నిజానికి మామిడి పండ్ల కంటే ఎక్కువగా.. మామిడి ఆకుల వలన మన శరీరానికి ఎక్కువ ఉపయోగాలు ఉన్నాయని.. నిపుణులు చెబుతున్నారు.
మామిడి ఆకుల వల్ల ఉన్న ఎన్నో ప్రయోజనాలలో మొదటిది.. గాయలు త్వరగా మానడం. కొన్నిసార్లు మన ఒంటికి తగిలిన గాయాలు త్వరగా తగ్గవు. అలాంటి సమయంలో మామిడి ఆకులను ఉపయోగిస్తే గాయాలు చాలా త్వరగా మానిపోతాయి. మామిడి ఆకుల్లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, గాయం దగ్గర బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా, త్వరగా మానిపోయేలా చేస్తాయి. గోరువెచ్చటి నీళ్ళల్లో ఈ మామిడాకులు వేసుకొని స్నానం చేయడం ద్వారా గాయాలు త్వరగా మానడమే కాకుండా.. మన చర్మం అందంగా కూడా కనిపిస్తుంది.
మామిడి ఆకుల వల్ల మన జుట్టుకి కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ముఖ్యంగా మామిడాకుల్లో ఉండే విటమిన్ ఏ, విటమిన్ సి లు మన శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తికి దోహదపడతాయి. వాటి వల్ల మన కురులు అందంగా పొడవుగా పెరుగుతాయి. మామిడి ఆకుల పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ ని జుట్టుకి అప్లై చేయడం వల్ల.. హెయిర్ ఫాల్ వంటి సమస్యలు.. చుండ్రు వంటి సమస్యలు కూడా త్వరగా తగ్గిపోతాయి.
ఇక డయాబెటిస్ తో బాధపడుతున్న వారు కూడా.. మామిడాకులను సంకోచించకుండా ఉపయోగించవచ్చు. మామిడి ఆకులు తినడం వల్ల.. మన శరీరానికి ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతుంది అని పరిశోధనల్లో కూడా తేలింది. మామిడి ఆకుల వల్ల అధిక బీపీ కూడా తగ్గుతుంది. ఆ విధంగా గుండెపోటు వచ్చే ప్రమాదం కూడా తగ్గిపోయినట్లే. జీర్ణవ్యవస్థ పై కూడా మామిడి ఆకుల ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. మామిడాకులు తరచుగా తీసుకుంటూ ఉండటం వల్ల.. జీర్ణ సమస్యలు రాకుండా ఉంటాయి..
కిడ్నీ స్టోన్స్ కి కూడా మామిడి ఆకులు దివ్య ఔషధంగా పని చేస్తాయి. ఇక మామిడి ఆకుల్లో ఉండే ఆంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు.. త్వరగా బరువు కూడా తగ్గేలా చేస్తాయి. పొట్టలో ఉండే అల్సర్ లు, ఎక్కిళ్లు కూడా మామిడాకులు తగ్గించగలవు.
మరి ఇన్ని ప్రయోజనాలతో మామిడాకులు కేవలం అలంకరణకి మాత్రమే కాకుండా.. ఆరోగ్యానికి కూడా ఎన్నో విధాలుగా ఉపయోగపడతాయి అని చెబుతున్నారు వైద్య నిపుణలు.
Also Read: DE Suspend: మాజీమంత్రి మల్లారెడ్డి మీటింగ్‌లో కరెంట్ కట్.. ఉద్యోగి పోస్టు ఊస్ట్
Also Read: Once Again KCR CM: ఎంపీ సీట్లు 10-12 వస్తే కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి: కేటీఆర్ ప్రకటన
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter