మధుమేహం ( Diabetes ) , గుండెజబ్బులు ( Cardioc problems ) , రక్తపోటు ( Blood Pressure ) , క్యాన్సర్ ( Cancer ) , అల్సర్ తరచూ విన్పిస్తూ పీడించే వ్యాధులు. దీర్ఘకాలం సతాయించే వ్యాధులు. ఆ ఆయిల్ ను క్రమం తప్పకుండా వాడితే కచ్చితంగా ఈ వ్యాధులు తగ్గుతాయని నిపుణులు చెబుుతున్నారు. అందుకే అమెరికాకు చెందిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ దీన్ని మిరాకిల్ హెర్బ్ గా అభివర్ణించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇంతకీ ఆ అయిల్ ఏంటి ? వాడుకలో కలోంజి ఆయిల్ ( Kalonji oil ) లేదా బ్లాక్ సీడ్ ఆయిల్ ( Black seed oil ) గా పిలుస్తారు. యాంటీ ఆక్సిడెంట్ గుణాలు, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ లక్షణాలు కలిగిన నిజెల్లా సటైవా సీడ్స్ ( Nigella sativa seeds )  నుంచి ఈ ఆయిల్ ను తయారు చేస్తారు. మరణం తప్ప అన్ని వ్యాధుల్ని ఈ ఆయిల్ జయిస్తుందనే మాట కూడా ప్రాచుర్యంలో ఉంది.  క్యాన్సర్, డయాబెటిస్, హార్ట్ డిసీజెస్, ఒబెసిటీ, బ్యాక్టీరియల్ ఇన్ ఫెక్షన్స్, నిమోనియా, చర్మ వ్యాధుల్ని తగ్గించే లక్షణాలున్నట్టు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అధ్యయనం చెబుతోంది. Also read: Immunity Diet: రోగనిరోధక శక్తిని పెంచే దోసకాయ జ్యూస్


ఔషధ గుణాలు కలిగిన ఈ బ్లాక్ సీడ్ గింజలు నిజెల్లా సటైవా  ( Nigella sativa flower ) అనే ఓ పువ్వు నుంచి వస్తాయి. బ్లాక్ క్యూమిన్ ఫ్లవర్స్ ( Black cumin flowers ) గా పిలిచే ఈ పువ్వులు నైరుతి ఆసియా, మధ్య  ఆఫ్రికా ప్రాంతాల్లో ఎక్కువగా కన్పిస్తాయి. విభిన్న చికిత్సా పద్ధతుల్లో బ్లాక్ సీడ్స్ ను ఆయిల్ ను వినియోగిస్తున్న చరిత్ర చాలాకాలంగా ఉంది ఈ ప్రాంతంలో. ట్రెడిషనల్ మెడిసిన్ గా కూడా చాలా ప్రాంతాల్లో బ్లాక్ సీడ్  ఆయిల్ ను వినియోగిస్తున్నారు. Also read: Coronavirus: కరోనాను జయించిన 107 ఏళ్ల వృద్ధుడు


ఎలా ఉపయోగించాలి ?


రోగం ఏదైనా సరే వాడే పద్ధతి సహజంగా ఒకటే ఉంది. రోగం తీవ్రతను బట్టి ఎక్కువసార్లు వాడటమా లేదా అనేది ఉంటుంది. బ్లాక్ సీడ్ ఆయిల్ లేదా కలోంజి ఆయిల్ ను ఉదయం పర కడుపున, రాత్రి నిద్రించే ముందు వాడాల్సి ఉంటుంది. 5-6 చుక్కల బ్లాక్ సీడ్ ఆయిల్ ను గోరువెచ్చని నీటిలో లేదా బ్లాక్ టీతో కలుపుకుని సేవించాలి. రోజుకు రెండుసార్లు తీసుకుంటే ఎక్కువ ఫలితాలుంటాయి. 


ఏయే రోగాలకు :


మధుమేహం ( Diabetes ) తో బాధపడుతున్నవారు రోజూ క్రమం తప్పకుండా రెండుసార్లు ఈ ఆయిల్ ను గోరువెచ్చని నీటితో కలిపి తీసుకుంటే నెలరోజుల్లోనే ఫలితాలు కన్పిస్తాయని యూఎస్  ఎన్ఐహెచ్ అధ్యయనం చెబుతోంది. అల్సర్ ( Ulcer ) వంటి వాటికి నేరుగా ఆయిల్ ను అప్లై చేయవచ్చు. ఒబెసిటీ ( Obesity ) , రక్తపోటు ( Blood pressure BP ) సమస్యతో బాధపడుతున్నవారు రోజూ వాడితే మంచి ఫలితాలు ఉంటాయి. రక్తపోటు అదుపులో ఉంటుంది. ఈ ఆయిల్ కు ఉండే యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాల వల్ల చాలా రకాల రుగ్మతల్లో మెరుగైన ఫలితాల్ని ఇస్తుందని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అధ్యయనం చేసింది. ఈ మందు అన్ని మెడికల్ షాపుల్లో అందుబాటులో  ఉండదు. కొన్ని ప్రత్యేకమైన షాపుల్లోనే లభ్యమవుతుంది. లేదా ఆన్ లైన్ లో చాలా రకాల బ్రాండ్లు అందుబాటులో  ఉన్నాయి. 3 వందల ఎంఎల్ ఆయిల్ 5 వందల రూపాయల్నించి లభ్యమవుతుంది. Also read: World Chocolate Day: డార్క్ చాక్లెట్ వల్ల ఎన్ని లాభాలో