Covid19: ఢిల్లీ: ఇది చదివిన తరువాత మీరు ఆశ్చర్యపోవడం ఖాయం.. ఎందుకంటే ఆయన అసలే 107 ఏళ్ల పండు ముసలి.. కరోనా ఆయన్ను కూడా వదిలిపెట్టలేదు. అయితే ఆ వృద్ధుడి బలమైన సంకల్పం ముందు కరోనా ఓడిపోయింది. ఇది ఎక్కడో కాదు.. మన దేశ రాజాధాని ఢిల్లీలోనే జరిగింది. రోజురోజుకి ఢిల్లీలో నమోదవుతున్న కరోనా కేసులతో ( Coronavirus ) భయాందోళనకు గురవుతున్న ప్రజలు.. కరోనాపై పోరాటంలో ఇప్పుడు ఈ వృద్ధుడిని ఆదర్శంగా తీసుకుంటున్నారు. Also read: కోవిడ్‌పై యుద్ధమంటూ పాట రాసి.. కరోనాతోనే కన్నుమూసిన నిస్సార్
ఢిల్లీలోని నవాబ్‌గంజ్ ప్రాంతంలో 107ఏళ్ల ముక్తార్ అహ్మద్ ( Mukhtar Ahmad ) కుటుంబంతో కలిసి నివసిస్తున్నారు. మే నెలలో కరోనా బారిన పడి రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నుంచి కేవలం 17రోజుల్లోనే డిశ్చార్జ్ అయినట్లు వైద్యులు పేర్కొన్నారు. ఆశ్చకరమైన విషయం ఎమిటంటే.. ఈ వయస్సులో కూడా ఆయన రికవరీ రేటు చాలా మంచిగా ఉంది. ఆయన 70 ఏళ్ల కుమారుడికి కూడా కరోనా సోకింది. అయితే కుమారుడి కంటే వేగంగా ముక్తారే వ్యాధి నుంచి కోలుకున్నాడు. ఆయన భార్య, కొడుకుతో సహా అతని కుటుంబంలోని చాలా మంది కూడా కరోనా బారిన పడి ఇప్పుడు అందరూ డిశ్చార్జ్ అయ్యారు. Also read: Coronavirus: గాలితో కూడా కరోనా: WHO
ఇదిలాఉంటే.. ముక్తార్ అహ్మద్ మాట్లాడుతూ.. తన చిన్నతనంలో 1918లో అంటువ్యాధి స్పానిష్ ఫ్లూను కూడా ఎదుర్కొన్నట్లు చెప్పారు. తాను పలు వ్యాధులతో పోరాడానని అప్పటి విషయాలన్నీ చెప్పి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఏది ఏమైనా జీవించాలనే సంకల్పం ఉంటే.. దేనినైనా జయించవచ్చు అని ముక్తార్ ఈ వయస్సులో కూడా చేసి చూపించాడు. Also read: Free Cylinder Ujjwala Yojana: మరో మూడు నెలలు ఉచిత సిలిండర్లు
జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..