Tears of Happiness: మనం పట్టరాని సంతోషానికి లోనైనప్పుడు మన కళ్ల నుంచి నీళ్లు వాటంతటవే ఉబికి వస్తుంటాయి. వీటినే మనం ఆనంద భాష్పాలు అని కూడా అంటాం. ముఖ్యంగా భావోద్వేగపూరితమైన కొన్ని సందర్భాల్లో నవ్వు, ఏడుపు ఒకేసారి వస్తుంటాయి. తద్వారా మనిషిలో ఉన్న ఒత్తిడి పూర్తిగా తొలగిపోతుంది. ఈ ఆనంద భాష్పాల వెనుక ఉన్న శాస్త్రీయపరమైన కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కొన్ని అధ్యయనాల ప్రకారం... ఆనంద భాష్పాలకు 2 కారణాలు ఉన్నాయి. మొదటి కారణం.. మనం స్వేచ్ఛగా నవ్వినప్పుడు.. అది మన మెదడులోని లాక్రిమల్ గ్రంధులపై ప్రభావం చూపుతుంది. ఫలితంగా కళ్ల నుంచి నీళ్లు బయటకు వస్తాయి.


రెండవ కారణం ఏమిటంటే.. భావోద్వేగపూరిత సందర్బంలో నవ్వినప్పుడు.. అది ముఖంలోని కణాలపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది. అప్పుడు కళ్ల నుంచి నీళ్లు బయటకొస్తాయి. ఒకరకంగా మన శరీరం కన్నీళ్ల ద్వారా ఒత్తిడిని సమతుల్యం చేయడానికి ప్రయత్నిస్తుంది.


వాస్తవానికి ఈ మొత్తం ప్రక్రియ ప్రతి వ్యక్తిలో భిన్నంగా ఉంటుంది. కొంతమంది త్వరగా ఉద్విగ్నతకు లోనవుతారు. అలాంటివారిలో ఆనందభాష్పాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్త్రీలు పురుషుల కంటే ఎక్కువ భావోద్వేగానికి గురవుతారని చెబుతారు. 


హార్మోన్ల ప్రధాన పాత్ర:


బాల్టిమోర్‌లోని యూనివర్శిటీ ఆఫ్ మేరీల్యాండ్‌కి చెందిన మనస్తత్వవేత్త రాబర్ట్ ప్రొవిన్ ప్రకారం... మనిషి భావోద్వేగానికి గురికావడంలో హార్మోన్లు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. నిరంతరం నవ్వడం లేదా ఏడవడం వల్ల మెదడు కణాలపై చాలా ఒత్తిడి ఉంటుంది. అప్పుడు కార్టిసాల్, అడ్రినలిన్ అనే హార్మోన్లు శరీరంలో విడుదలవుతాయి. మీరు నవ్వినప్పుడు లేదా ఏడ్చినప్పుడు అందుకు వ్యతిరేకంగా జరిగే ప్రతిచర్యకు ఈ హార్మోన్లే కారణం


Also Read: Nitin Gadkari News: రానున్న రెండేళ్లలో ఎలక్ట్రిక్ వాహనాల ధరలు భారీగా తగ్గుతాయి: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ


Also Read: Lalu Yadav Health: మరింతగా క్షీణించిన లాలూ యాదవ్ ఆరోగ్యం.. ఢిల్లీలోని ఎయిమ్స్ కు తరలించేందుకు ఏర్పాట్లు!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook