Raisins Health Benifits: కొంతమంది పురుషులు శారీరక, లైంగిక బలహీనతతో బాధపడుతుంటారు. అలాంటి వారు తమ డైట్‌లో కొన్ని మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఎండు ద్రాక్షను తీసుకోవడం వారి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఎండు ద్రాక్షలో ప్రోటీన్, హెల్తీ ఫ్యాట్, ఐరన్, ఫైబర్, కాపర్, పొటాషియం వంటి పోషక గుణాలు ఉన్నాయి. ఎండు ద్రాక్షను రెగ్యులర్‌గా తీసుకోవడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శారీరక బలహీనతకు చెక్ :


శారీరక బలహీనతలను దూరం చేయడంలో ఎండు ద్రాక్ష బాగా ఉపయోగపడుతుంది. శారీరక బలహీనతతో బాధపడే పురుషులు తప్పనిసరిగా ఎండు ద్రాక్షను తమ డైట్‌లో చేర్చుకోవాలి. ఎండు ద్రాక్షను పాలతో తీసుకోవడం వల్ల శారీరకంగా దృఢంగా, శక్తివంతంగా తయారవుతారు. అంతేకాదు, బరువు కూడా నియంత్రణలో ఉంటుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు కూడా ఎండు ద్రాక్షను తినవచ్చు.


గుండె సంబంధిత సమస్యలకు చెక్ :


మహిళల కంటే పురుషులకు గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. మగవారు తమ గుండెను ఫిట్‌గా ఉంచుకోవడానికి ఎండు ద్రాక్షను తీసుకుంటే ఎంతో మంచిది. ఎండుద్రాక్షలో పొటాషియం అధిక రక్తపోటును కూడా నియంత్రిస్తుందని నిపుణులు చెబుతారు.


లైంగిక బలహీనతను దూరం చేస్తుంది:


కొంతమంది పురుషులు లైంగిక బలహీనతతో బాధపడుతుంటారు. చాలామంది దాన్ని ఎవరికీ చెప్పుకోలేక సతమతమవుతుంటారు. ఎండు ద్రాక్షలో ఉండే అమైనో ఆమ్లాలు లైంగిక బలహీనతను అధిగమించేలా చేస్తాయి. అంతేకాదు, ఎండు ద్రాక్ష రెగ్యులర్‌గా తీసుకుంటే స్పెర్మ్ కౌంట్ కూడా పెరుగుతుంది.


(Disclaimer: ఈ కథనం సాధారణ సమాచారం కోసం మాత్రమే. ఇది ఏ విధంగానూ ఎటువంటి చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. అనారోగ్య సమస్యలకు వైద్యుడి సూచనలు పాటించాలి)


Also Read: Russia Ukraine War: యూనివర్సిటీ బంకర్‌లో తలదాచుకున్న భారతీయ విద్యార్థిని.. అక్కడ పరిస్థితి ఎలా ఉందంటే..


Also Read: Binura Fernando Catch: అచ్చు పక్షిలా గాల్లోకి ఎగిరి.. ఒంటిచేత్తో స్టన్నింగ్ క్యాచ్ పట్టిన శ్రీలంక ప్లేయర్ (వీడియో)!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook