Covid19 Vaccination: కోవిడ్ 19 నియంత్రణకు వ్యాక్సినేష్ ఒక్కటే మార్గం. వ్యాక్సిన్ తీసుకుంటే సంక్రమణ ఆగుతుందనేది ఇప్పటి వరకూ పరిశోధకులు చెప్పిన మాట. కానీ ఇప్పుడది తప్పని తెలుస్తోంది. తాజా అధ్యయనం నివేదిక ఆందోళన కల్గిస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా మహమ్మారి(Corona Pandemic)నుంచి రక్షణ పొందాలంటే కరోనా వ్యాక్సిన్ తప్పనిసరి అని పరిశోధకులు, వైద్య నిపుణులు చెబుతున్నమాట. వ్యాక్సిన్ తీసుకుంటే తీవ్రత తగ్గుతుందని..లేదా వ్యాధి సంక్రమణ ఆగుతుందనేది ప్రధాన వాదనగా ఉంది. అయితే లాన్సెట్ మెడికల్ జర్నల్‌లో ప్రచురితమైన తాజా అధ్యయనం వివరాలు పరిశీలిస్తే ఆందోళన కలుగుతుంది.యూకేలోని ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్ శాస్త్రవేత్తల అధ్యయనం ఫలితాలు ఇవి. కరోనా వ్యాక్సినేషన్(Corona vaccination) తీసుకుంటే సంక్రమణ ఉండదని చెబుతున్నవాదనలో నిజం లేదని ఈ అధ్యయనం చెబుతోంది. ఇదే ఇప్పుడు కొత్త ఆందోళనకు దారి తీస్తోంది. 


కోవిడ్ 19 రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నవారి నుంచి కూడా ఈ మహమ్మారి వ్యాప్తి చెందుతోందని లాన్సెట్ జర్నల్‌లో(Lancet Journal)ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్(Imperial College London)శాస్త్రవేత్తల అధ్యయనం ప్రచురితమైంది. వ్యాక్సిన్ తీసుకోనివారితో పోలిస్తే..తీసుకున్నవారిలో వైరస్ తీవ్రత తక్కువగా ఉందని..కానీ సంక్రమణ మాత్రం అవుతోందని అధ్యయనం తేల్చింది. రెండు డోసులు తీసుకున్నవారికి కూడా వైరస్ సోకుతుంది..వారి నుంచి ఇతరులకు వ్యాపిస్తోందని ఇంపీరియల్ కాలేజ్ పరిశోధకులు వెల్లడించారు. అయితే వ్యాక్సిన్ తీసుకున్నవారు త్వరగా కోలుకుంటుంటే..వారి నుంచి అదే ఇంట్లో నివసిస్తూ వ్యాక్సిన్ తీసుకోకుండా ఉండేవారిని ఆ వ్యాధి బాగా వేధిస్తోందని నివేదిక వెల్లడించింది. కరోనా సంక్రమణను కట్టడి చేసేందుకు వ్యాక్సిన్ అత్యంత కీలకమే కానీ వ్యాక్సిన్ తీసుకున్నవారు మనకేం కాదులే అనే ధీమాతో ఉండకూడదని అధ్యయనం చెబుతోంది. ఎందుకంటే వ్యాక్సిన్ తీసుకున్నవారి నుంచి ఇతరులకు వైరస్ వ్యాప్తి చెందడమే దీనికి కారణం. వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతున్నా కరోనా కేసులు పెరగడానికి ఇదే కారణంగా తెలుస్తోంది. వ్యాక్సిన్ రెండవ డోసు తీసుకున్న 3 నెలల తరువాత నుంచి వైరస్ ఇతరులకు వ్యాపిస్తున్నట్టు ఈ అధ్యయనంలో గుర్తించారు. 


Also read: Third Wave: ఇండియాలో 17 కొత్త వేరియంట్ల కరోనా కేసులు.. థర్డ్ వేవ్ రానుందా..??


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి