Third Wave: ఇండియాలో 17 కొత్త వేరియంట్ల కరోనా కేసులు.. థర్డ్ వేవ్ రానుందా..??

భారత్ లో కరోనా డెల్టా వేరియంట్లు కలకలం శృష్టిస్తున్నాయి. ప్రస్తుతం మన దేశంలో 17 కొత్త వేరియంట్ల కేసులను కనుగొనన్నారు. కరోనా థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు   

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 28, 2021, 07:15 PM IST
  • మళ్లీ చెలరేగుతున్న కరోనా కొత్త వేరియంట్ల కేసులు
  • ఐదు రాష్ట్రాల్లో 17 కొత్త వేరియంట్ల కేసుల నమోదు
  • థర్డ్ వేవ్ వచ్చే అవకాశాలు అవకాశం ఉందన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ
Third Wave: ఇండియాలో 17 కొత్త వేరియంట్ల కరోనా కేసులు.. థర్డ్ వేవ్ రానుందా..??

New Corana Variant 17 Cases Report in 5 States: ముగిసిందనుకుంటున్న కరోనా (Corona) మళ్లీ చెలరేగిపోతుంది. ఇప్పటికీ వచ్చిన రెండు వేవ్ (Corona Second Wave) లు ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. ఎందరో ప్రాణాలను , ఉపాధిని కోల్పోయారు. కొన్ని రోజుల నుండి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గినప్పటికీ, థర్డ్ వేవ్ (Third Wave) వచ్చే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organization) వెల్లడించింది. 

మన దేశంలో కరోనా భారినపడే వారి సంఖ్య తగ్గుతున్నా.. కొత్త రకం వేరియంట్ (New Corona Variants) నిర్దారణలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. ప్రస్తుతం మన దేశంలో ఏవై.4.2 (AY.4.2) 17 కొత్త కేసులు నమోదయ్యాయని అధికారులు వెల్లడించారు. నిజానికి ప్రపంచ వ్యాప్తంగా కరోనా రెండో వేవ్ భీభత్సవం శృష్టించిన డెల్టా వేరియంట్ (Delta Variant) కుటుంబాయినికి చెందినవే ఈ ఏవై.4.2 వేరియంట్లు. ఈ రకం వేరియంట్ల వల్ల మళ్లీ  థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని నిపుణులు తెలుపుతున్నారు. ఇప్పటికే రష్యా (Russia) వంటి దేశాలలో కరోనా మరణాలు గణనీయంగా పెరగటంతో కరోనా థర్డ్ వేవ్ వచ్చే అవకాశాలున్నాయనే వాదనలను బలపరుస్తున్నాయి. 

Also Read: Hardship of Life: ప్రపంచం కంట కన్నీరు పెట్టిస్తున్న ఫోటో.. గుండె బరువెక్కించే సన్నివేశం

తెలంగాణ (Telangan), ఏపీ (AP), కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక మరియు జమ్మూ కశ్మీర్‌ రాష్ట్రాల్లో ఇప్పటికే ఈ కొత్త వేరియంట్లను అధికారులు కనుగొన్నారు. ముఖ్యంగా మహారాష్ట్రలో (Maharastra) కొత్త వేరియంట్ల కేసుల సంఖ్య పెరుగుతుందని అధికారులు వెల్లడించారు ఇంకా కరోనా (Corona) శకం ముగియలేదు.. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ, గడువులోపు వ్యాక్సిన్ (Corona Vaccine) తప్పక వేసుకోవాలని సూచిస్తున్నారు. 

గడచిన 24 గంటల్లో పాజిటివ్ సంఖ్యతో  పాటు మరణాల సంఖ్య గణనీయంగా పెరిగింది. కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం... గడచిన 24 గంటల వ్యవధిలో (last 24 hours) కేసుల సంఖ్య 16,156 పెరగ్గా.. మృతుల సంఖ్య మాత్రం 733గా నమోదైంది. మంగళవారం 12,90,900 మంది కరోనా (corona tests) నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు. 16,156 మందికి కరోనా పాజిటివ్‌గా (corona positive) తేలింది. 

Also Read: Aryan Khan in Drugs Case: 25 రోజుల తరువాత ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ మంజూర్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News