Side Effects of Drinking Lemon Water: లెమన్ వాటర్ మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో మనందరికీ తెలుసు. ఉదయం లేవగానే గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకుని తాగడం వల్ల సులభంగా బరువు తగ్గుతారు. దీంతో పాటు జీర్ణక్రియ సమస్యల కూడా సులభంగా దూరమవుతాయి. అంతేకాకుండా చాలా రకాల పొట్ట సమస్యలు కూడా దూరమవుతాయి. కాబట్టి పొట్ట సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ప్రతి రోజూ తాగాలి. అయితే నిమ్మ రసాన్ని అతిగా తాగడం వల్ల శరీరానికి తీవ్ర దుష్ర్పభావాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి ఈ నీటిని ప్రతి రోజూ తాగడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నిమ్మరసం ఎక్కువగా తాగడం వల్ల కలిగే దుష్ప్రభావాలు:
నిమ్మరసం అతిగా తాగడం వల్ల శరీరంలో చాలా రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. అంతేకాకుండా ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. కాబట్టి ఈ నీటిని ప్రతి రోజూ అతిగా తాగడం వల్ల ముఖ్యమైన అవయవాలను ప్రభావితం చేస్తుంది.


1. కడుపు నొప్పి:
విటమిన్ సి అధికంగా పెరగడం వల్ల కడుపులో ఆమ్ల స్రావం పెరుగుతుంది. దీని కారణంగా ఎసిడిటీ సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. అంతేకాకుండా నిమ్మరసం ఎక్కువగా తాగడం వల్ల వాంతులు, విరేచనాలు, వికారం వంటి సమస్యలు కూడా వస్తాయి. ముఖ్యంగా గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్‌తో బాధపడుతున్నారు నిమ్మ రసం తాగడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి.


2. నోటిలో బొబ్బలు వచ్చే ఛాన్స్‌:
నిమ్మ రసం తాగడం వల్ల నోటి దుర్వాసన, దంతాలను శుభ్రం చేస్తుంది. అయితే మీరు నిమ్మరసం ఎక్కువగా తాగితే..అందులో ఉండే సిట్రిక్ యాసిడ్ నోటి కణజాలంలో వాపును కలిగిస్తుంది. దీని కారణంగా పొక్కులు, మంటలు వచ్చే అవకాశాలున్నాయి. అంతేకాకుండా నోటిలో పుండ్లు వచ్చే అవకాశాలున్నాయి.


3. బలహీనమైన దంతాలు:
నిమ్మరసం అతిగా తాగడం వల్ల దంతాలు కూడా బలహీనంగా మారుతాయి.అంతేకాకుండా కొందరిలో విరిగిపోయే ఛాన్స్‌ కూడా ఉంది. కాబట్టి తప్పకుండా నిమ్మ రసం అతిగా తాగొద్దని నిపుణులు చెబుతున్నారు.


(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు మరియు సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)


Also read: Apple iPhone 13, iPhone 14: యాపిల్ ఐఫోన్ కొనేవారికి హోలీ పండగ బంపర్ ఆఫర్


Also read: Apple iPhone 13, iPhone 14: యాపిల్ ఐఫోన్ కొనేవారికి హోలీ పండగ బంపర్ ఆఫర్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook