Best Ways To Lose Belly Fat With Roti: ప్రస్తుతం చాలామంది బెల్లీ ఫ్యాట్ సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్య చిన్నదే అయినప్పటికీ భవిష్యత్తులో దీనికి కారణంగా అనేక రకాల అనారోగ్య సమస్యలు రావచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఇప్పటికే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు బెల్లీ ఫ్యాట్ సమస్య ఉంటే తప్పకుండా నియంత్రించుకోవడం చాలా మంచిది. లేకపోతే మధుమేహం, అధిక రక్తపోటు సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా 60 సంవత్సరాలు పైబడిన వారిలో ఈ బెల్లీ ఫ్యాట్ సమస్య ఉంటే తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాలి. లేకపోతే గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే చాలామంది ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి వివిధ రకాల డైట్లను అనుసరిస్తున్నారు. ఇటీవల కొంతమంది ఆరోగ్య నిపుణులు తెలిపిన ఓట్స్ రోటీని ప్రతిరోజు తీసుకోవడం వల్ల సులభంగా మంచి ఫలితాలు పొందుతారు. అయితే ఈ ఓట్స్ రోటి రెసిపీ కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బెల్లీ ఫ్యాట్‌ తగ్గించడానికి ఓట్స్‌ రోటీల రెసిపీ
కావలసిన పదార్థాలు:

1 కప్పు ఓట్స్ పిండి
1/2 కప్పు గోధుమ పిండి
1/4 కప్పు తురిమిన బెల్లం
1/4 కప్పు పెరుగు
1/4 టీస్పూన్ యాలకుల పొడి
1/4 టీస్పూన్ ఉప్పు
1/4 కప్పు నీరు (అవసరమైనంత)


తయారీ విధానం:
ఒక గిన్నెలో ఓట్స్ పిండి, గోధుమ పిండి, బెల్లం, పెరుగు, యాలకుల పొడి, ఉప్పు కలపాలి.
కొద్ది కొద్దిగా నీరు కలుపుతూ, మృదువైన ముద్దలా కలుపుకొని 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి.
ఆ తర్వాత పక్కన పెట్టుకున్న పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి.
ఇలా ఉండలు చేసుకున్న పిండిని తీసుకొని, రోటీల కోలతో బాగా గుండ్రని షేప్ లో చపాతీల్లా చేసుకోవాలి.
ఆ తర్వాత ఒక వేడి పాన్‌లో రోటీని రెండు వైపులా కాల్చుకోవాలి.
ఇలా అన్ని రోటీలను కాల్చుకోవాలి.


సూచనలు:
ఈ రోటిలా రుచిని మరింత పెంచుకోవడానికి, పిండిలో కొన్ని చిన్న ముక్కలు క్యారెట్, బీట్‌రూట్ లేదా ఇతర కూరగాయలను కూడా కలపవచ్చు.
ఈ రోటీల నుంచి మరిన్ని లాభాలు పొందడానికి గోధుమ పిండికి బదులుగా జొన్నపిండి లేదా రాకులతో తయారుచేసిన పిండిని కూడా వినియోగించవచ్చు.
ఈ రోటీలను ఫ్రైలతో కలుపుకొని తీసుకోవడం వల్ల ఎంతో రుచితో పాటు ఆరోగ్యాన్ని పొందవచ్చు.


ఈ రోటిలో ఉండే ప్రయోజనాలు:
ఓట్స్‌లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది, ఇది మిమ్మల్ని ఎక్కువసేపు ఆకలితో ఉంచడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా సులభంగా ఆకలిని నియంత్రించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది.


ఓట్స్‌లో బీటా-గ్లూకాన్ అనే పదార్థం అధిక మోతాదులో లభిస్తుంది. కాబట్టి ఇది చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయిలను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ను పెంచేందుకు ఎంతగానో సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.


Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..


బెల్లంలో సహజమైన తీపి ఉంటుంది. అంతేకాకుండా ఇందులో వాడిన పెరుగులో ప్రోబయోటిక్స్ అధిక మోతాదులో లభిస్తాయి. కాబట్టి వీటిని ప్రతిరోజు తీసుకోవడం వల్ల బెల్లీ ఫ్యాట్ తగ్గడమే కాకుండా జీర్ణ క్రియ కూడా మెరుగుపడుతుంది.


Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి