కరోనావైరస్ (Coronavirus) లాంటి మహమ్మారి నుంచి తప్పించుకునేందుకు ఇప్పుడు అందరూ ముఖానికి మాస్కులు, చేతులకు గ్లోవ్స్ ధరిస్తున్నారు. మాస్కులు, గ్లోవ్స్ ధరించడం ద్వారా కరోనా వైరస్ వ్యాపించకుండా అడ్డుకోవచ్చనే ఉద్దేశంతోనే అందరూ ఆ పద్దతిని అనుసరిస్తున్నారు. కానీ కొంతమంది నిపుణులు చెబుతున్న మాట (Experts say on Coronavirus) అందుకు విరుద్ధంగా ఉంది. వైరస్‌ను నివారించడం కోసం మాస్కులు, గ్లోవ్స్ ధరించడం వల్ల ఏ మాత్రం ఉపయోగం ఉండదు సరికదా.. పైగా ఇన్‌ఫెక్షన్స్ ఇంకా ఎక్కువ వేగంగా విస్తరించే అవకాశం ఉందంటున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read also : ఏయే బ్లడ్ గ్రూప్ వాళ్లకు Coronavirus సోకే రిస్క్ ఎక్కువ ? ఎవరు సేఫ్ ?


కరోనావైరస్ వేగంగా వ్యాపిస్తున్న ప్రస్తుత తరుణంలో ఇప్పటికే ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్ దేశాల్లో నివారణ చర్యల్లో భాగంగా లాక్‌డౌన్ విధించారు. మరోవైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organization) సైతం తమ సలహాలు సూచనలు పాటించాల్సిందిగా యావత్ ప్రపంచానికి విజ్ఞప్తి చేస్తోంది. చేతులు పరిశుభ్రంగా కడుక్కోవడం, ముఖానికి చేతులు తాకకుండా చూసుకోవడం, ఇతరుల నుంచి కొంత దూరంగా ఉండాలని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చేసిన సూచనలను దాదాపు అందరూ పాటిస్తున్నారు. వ్యాపార సంస్థలు సైతం తమ సిబ్బందిని ఈ జాగ్రత్తలు పాటించాల్సిందిగా సూచిస్తూ ఎప్పటికప్పుడు పలు హెచ్చరికలు చేస్తున్నాయి. మీకు కానీ లేదా మీ చుట్టూ ఉన్న వారికి కానీ కరోనా వైరస్ సోకినట్టుగా భావిస్తే.. వైరస్‌ని నివారించేటటువంటి పటిష్టమైన మాస్కులు ధరించాల్సిందిగా డబ్లూహెచ్ఓ సైతం సూచిస్తోంది. 


Read also : కరోనావైరస్ భారత్‌లో అంతగా వ్యాపించకపోవడానికి కారణాలు ఇవేనా ?


మాస్కులు, గ్లోవ్స్‌తో పొంచి ఉన్న ప్రమాదం ఏంటి ?
మాస్కులు, గ్లోవ్స్ ధరించిన తర్వాత సురక్షితంగా ఉండాలంటే అంతకంటే ముందుగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సూచించిన పలు సలహాలు, సూచనలు తూచ తప్పకుండా పాటించాల్సి ఉందంటున్నారు ఫ్రాన్స్ వైద్య ఆరోగ్య శాఖ విభాగం అధిపతి జెరోమ్ సోలోమన్. మాస్కులు, గ్లోవ్స్ ధరించినప్పటికీ చేతులు శుభ్రంగా కడగకపోతే చేతులకు తాకిన వైరస్ మళ్లీ మాస్కును, గ్లోవ్స్‌కు అంటుకునే ప్రమాదం ఉందంటున్నారు. ముఖ్యంగా మాస్కు సురక్షితమైనది అయ్యుండాలి. అంతేకాకుండా మాస్కును ధరించిన అనంతరం పదేపదే దానిని సర్దుకోకుండా చూసుకోవాలి. కానీ చాలామందికి పదేపదే మాస్కును సర్దుకునే అలవాటు ఉంటుంది. అంతేకాకుండా నోరు, ముక్కు, కళ్లు, చెవులను తాకకుండా ఉండాలి. కేవలం మాస్కు, గ్లోవ్స్ ధరించి... మిగతావన్నీ నిర్లక్ష్యం చేయడం వల్ల వైరస్ ఇంకా వేగంగా వ్యాపించే ప్రమాదం ఉందని జాన్ హాప్‌‌‌‌కిన్స్ సెంటర్ ఫర్ హెల్త్ సెక్యురిటీ అమేష్ అడల్జ ఏఎఫ్‌పికి తెలిపారు. 


Read also : Coronavirus: కరోనావైరస్‌ను మనిషే తయారు చేశాడా ?


2015లో ఇన్‌ఫెక్షన్ కంట్రోల్ అనే అమెరికన్ జర్నల్‌లో ప్రచురించిన ఓ అధ్యయనం ప్రకారం మనిషి గంటకు సగటున ఇరవైసార్లు ముఖాన్ని తాకుతారని తేలినట్టుగా ఇక్కడ నిపుణులు గుర్తుచేస్తున్నారు. అందుకే పాటించాల్సిన అన్ని సలహాలు, సూచనలు పాటించకుండా కేవలం మాస్కులు, గ్లోవ్స్ ధరించడం వల్ల వైరస్ వ్యాపించే ప్రమాదం ఎక్కువే ఉంటుంది కానీ తక్కువ కాదనేది వారి అభిప్రాయం. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..