ఏయే బ్లడ్ గ్రూప్ వాళ్లకు Coronavirus సోకే రిస్క్ ఎక్కువ ? ఎవరు సేఫ్ ?

ఏయే బ్లడ్ గ్రూప్ వాళ్లకు Coronavirus సోకే రిస్క్ ఎక్కువ ? ఎవరికి తక్కువ ప్రమాదం అని జరిపిన పరిశోధనల్లో A బ్లడ్ గ్రూప్ వారికి కరోనా వైరస్‌ సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటే.. O బ్లడ్ గ్రూప్ వారికి తక్కువ ప్రమాదం ఉందని తేలింది.

Updated: Mar 18, 2020, 06:10 PM IST
ఏయే బ్లడ్ గ్రూప్ వాళ్లకు Coronavirus సోకే రిస్క్ ఎక్కువ ? ఎవరు సేఫ్ ?
Photo:Reuters

ఏయే బ్లడ్ గ్రూప్ వాళ్లకు Coronavirus రిస్క్ ఎక్కువ ? ఎవరికి తక్కువ ప్రమాదం అని జరిపిన పరిశోధనల్లో A బ్లడ్ గ్రూప్ వారికి కరోనా వైరస్‌ సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటే.. O బ్లడ్ గ్రూప్ వారికి తక్కువ ప్రమాదం ఉందని తేలింది. చైనాలో కరోనావైరస్ సోకిన రోగుల బ్లడ్ గ్రూప్స్‌పై జరిపిన అధ్యయనం ఆధారంగా ఈ విషయం బయటపడినట్టుగా సోత్ చైనా మార్నింగ్ పోస్ట్ వెల్లడించింది. వుహాన్ యూనివర్శిటీలోని జాంగ్‌నన్ ఆస్పత్రికి చెందిన ఎవిడెన్స్ బేస్డ్ అండ్ ట్రాన్స్‌లేషన్ మెడిసిన్ సెంటర్‌లో వాంగ్ జింగ్‌హువాన్ నేతృత్వంలోని పరిశోధకుల బృందం వుహాన్‌, షీంజెన్‌లో కరోనా వైరస్ సోకిన 2000 మందికిపైగా రోగుల రక్త గ్రూపులను  అధ్యయనం చేసింది. ఈ పరిశోధనల్లో 'ఏ' బ్లడ్ గ్రూపు వారే ఎక్కువగా కరోనావైరస్ బారినపడినట్టుగా స్పష్టమైందంటున్నారు పరిశోధకులు. 

టైప్ 'ఏ' బ్లడ్ గ్రూప్ వారికి ఇన్‌ఫెక్షన్ త్వరగా సోకే ప్రమాదం ఉందని.. వారు వైరస్‌ల బారి నుంచి తప్పించుకోవడానికి ఎక్కువ శ్రద్ధ, జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పరిశోధకులు అభిప్రాయపడ్డారు. టైప్ 'o' గ్రూప్ రక్తం కలిగిన వారికి ఇన్‌ఫెక్షన్ సంబంధిత వ్యాధులు సోకే ప్రమాదం తక్కువేనని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. అయితే, ఇంతకీ ఈ పరిశోధనను ఎంతమేరకు ప్రామాణికంగా తీసుకోవచ్చనేదే ఇంకా తేలాల్సి ఉంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.