Milk And Oats Facepack: వయసు పెరగడంతో మన చర్మం తన స్థితిస్థాపకతను కోల్పోతుంది, ముడతలు ఏర్పడతాయి. ఈ సమస్యలను తగ్గించడానికి చర్మాన్ని యవ్వనంగా ఉంచడానికి యాంటీ ఏజింగ్ ఫేస్ మాస్క్‌లు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని హైడ్రేట్ చేస్తాయి, కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతాయి, చర్మాన్ని మరమ్మతు చేస్తాయి. బయట ఖరీదైనా యాంటీ ఏజింగ్‌ మాస్క్‌ కంటే ఇంట్లోనే సులభంగా మాస్క్‌ తయారు చేసుకోవచ్చు. దీని కోసం మనం ప్రతిరోజు ఉపయోగించే పదార్థాలు ఉంటే సరిపోతుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చర్మం ముడతలు పడకుండా ఉండాలంటే??


పాలు, ఓట్స్‌ రెండూ చర్మానికి చాలా మంచివి. వీటిని కలిపి ఫేస్ ప్యాక్‌గా వాడితే చర్మం మెరిసిపోతుంది. ఈ ఫేస్ ప్యాక్‌ ఎలా తయారు చేసుకోవాలో, దీని వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం. పాలు, ఓట్స్ చర్మాన్ని తేమగా ఉంచి, రుతు చర్మాన్ని నివారిస్తాయి.  వీటిని కలిపి ఫేస్ ప్యాక్‌గా వాడితే చర్మం మెరిసిపోవడమే కాకుండా, ముడతలు రాకుండా నిరోధించడానికి కూడా ఉపయోగపడుతుంది. దీని యాంటీ ఏజింగ్ ఎఫెక్ట్‌తో కూడిన ఫేస్ ప్యాక్  సహాయపడుతుంది. దీని వల్ల ముఖంలో మళ్లీ యవ్వనాన్ని చూడవచ్చు.


పాలు, ఓట్స్ ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేయాలి:


పదార్థాలు:


1/4 కప్పు పాలు
2-3 టేబుల్ స్పూన్లు ఓట్స్
1 టీస్పూన్ తేనె


తయారీ:


ఓట్స్‌ను కొద్దిగా నీటిలో నానబెట్టి, మెత్తగా గ్రైండ్ చేయండి. గ్రైండ్ చేసిన ఓట్స్‌కు పాలు మరియు తేనె కలిపి మిశ్రమం తయారు చేసుకోండి. ఈ మిశ్రమాన్ని ముఖం మొత్తం అప్లై చేసి, 15-20 నిమిషాలు ఆరబెట్టండి. ఆ తర్వాత చల్లటి నీటితో శుభ్రంగా కడగాలి. ఈ ఫేస్ ప్యాక్‌ను వారానికి 2-3 సార్లు వాడవచ్చు. ఏదైనా అలర్జీ ఉంటే, ఈ ఫేస్ ప్యాక్‌ను వాడే ముందు చిన్న భాగంలో పరీక్షించండి. ఈ ఫేస్ ప్యాక్ సహజమైనది అయినప్పటికీ, అన్ని చర్మాలకు సరిపోకపోవచ్చు. 


ఫలితాలు:


మురికి తొలగింపు: ఓట్స్ చర్మంపై మురికిని దూరం చేసి కాంతివంతంగా మారుస్తుంది. పాలు చర్మాన్ని హైడ్రేట్ చేస్తాయి. దీని చర్మం కాంతివంతంగా కనిపిస్తుంది. చర్మంపై ఎరుపు, దురద, వాపు వంటి సమస్యలు తగ్గిస్తాయి. తేనె చర్మాన్ని కాంతివంతంగా మార్చడంలో సహాయపడుతుంది.


గమనిక: 


చర్మ సమస్యలు ఉన్నప్పుడు వైద్యులను సంప్రదించడం చాలా ముఖ్యం. వైద్యుల సలహా మేరకు చికిత్స తీసుకోవడం ద్వారా ఆరోగ్యవంతమైన, మెరిసే చర్మాన్ని పొందవచ్చు. ఈ సమాచారం కేవలం సాధారణ సమాచారం కోసం మాత్రమే. ఏదైనా వైద్య సమస్య కోసం మీ వైద్యుడిని సంప్రదించండి.
 


Also read: Honey Benefits: ప్రతిరోజూ తేనె తింటే ఏమువుతుంది?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter