Nasal Sprays for COVID-19 and Cold Relief: సాధారణంగా వర్షాకాలం, చలికాలం వచ్చిందంటే కొందరు జలుబు సమస్యతో ఇబ్బంది పడుతుంటారు. అయితే ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న సమయం కనుక మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. మరికొన్ని రోజుల్లో కోవిడ్-19 టీకాలు ప్రారంభించనున్నట్లు కేంద్ర మంత్రి హర్షవర్దన్ సైతం తెలిపారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఏది ఏమైతేనేం మనం జాగ్రత్తల్లో ఉండటం మంచింది. ప్రస్తుతం కొందరు జలుబు, దగ్గు సమస్యలతో బాధపడుతుంటే మనకు మనం కరోనా వైరస్ (CoronaVirus) సోకిందేమోనన్న భయం మొదలవుతుంది. అయితే కొన్ని రకాల లిక్విడ్ డ్రాప్స్ COVID-19 ఇన్‌ఫెక్షన్లను నివారించడంలో బాగా పనిచేస్తున్నాయి. కొలంబియా విశ్వవిద్యాలయ పరిశోధకులు ఈ నాసల్ స్పేను తయారుచేవారు. కరోనా వైరస్ నుండి తాత్కాలిక, త్వరితగతిన ఉపశమనం పొందటానికి ఇది పనిచేస్తుంది.


Also Read: Health Benefits Of Neem: వేప తింటే షుగర్ కంట్రోల్, ఎన్నో ప్రయోజనాలు



అదే సమయంలో కొన్ని రకాల నాసల్ డ్రాప్స్, నాసల్ స్ప్రేలు ముక్కులోకి హానికారక క్రిములు, వైరస్‌లు వెళ్లకుండా సైతం ఇవి అడ్డుకుని ప్రభావం చూపిస్తాయి.


మానవుల 3డీ మోడల్‌తో నిర్వహించిన పరీక్షల్లో నాసల్ కొన్ని రకాల స్ప్రేలు జలుబు (Cold)తో పాటు COVID-19 ఇన్‌ఫెక్షన్లను నివారించడంలో  ప్రభావం చూపిస్తుందని గుర్తించారు. 


ఈ నాసల్ స్ప్రే తక్షణమే పనిచేస్తుంది మరియు పూర్తి 24 గంటలు దీని ప్రభావం ఉంటుంది. 


Also Read: Health tips: శీతాకాలంలో డయాబెటిస్ పేషెంట్స్ ఇవి తింటే రిస్కే 



జలుబు లాంటి సమస్యల బారిన పడేవారు వైద్యులను సంప్రదించి ఇలాంటి నాసల్ స్ప్రేలు వినియోగించడం ఉత్తమం. తద్వారా మీతో పాటు మీ కుటుంసభ్యులకు ఇబ్బంది తగ్గుతుంది. 


నాసల్ స్ప్రేలో లిపిడ్ మరియు పెప్టైడ్ మిశ్రమం ఉంటుంది. ఇది COVID-19కి కారణమయ్యే SARS-CoV-2 అనే వైరస్‌ను తొలి దశలో ఉండగా అడ్డుకుని రక్షణ ఇస్తుంది. 


Also Read: 5 Reasons for Heart Attack: గుండెపోటుకు ప్రధాన కారణాలు ఇవే.. బీ కేర్‌ఫుల్!



ఇలాంటి స్ప్రేలను వాడాలంటే ముందుగా ముక్కును శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత ఒక రెండు చుక్కలు ముక్కులో వేసుకోవాలి. డాక్టర్ల సలహా మేరకు వారు సూచించినట్లుగా నాసల్ స్ప్రేలు వాడాలి.


తరచుగా నాసల్ డ్రాప్స్ వాడటం వల్ల ముక్కులో ఉండే సూక్ష్మజీవులు నశిస్తాయి. హానికారక క్రియులు శరీరంలోకి ప్రవేశించవు. తద్వారా మీరు ఆరోగ్యంగా ఉంటారు. 


Also Read: Health Tips: రోగనిరోధక శక్తిని పెంచే 5 చిట్కాలు 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G  


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook