Diabetes Control Tips: మధుమేహంతో బాధపడుతున్నారా..ఆందోళన చెందవద్దు. షుగర్ వ్యాధిని సమూలంగా నిర్మూలించేందుకు కొన్ని మార్గాలున్నాయి. ఆ మార్గాలేంటో, బ్లడ్ షుగర్ ఎలా తగ్గించుకోవచ్చో చూద్దాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏదైనా వ్యాధిని ఎప్పుడైనా సమూలంగా నిర్మూలించడం సాధ్యమేనా..నిజంగానే కష్టమైన పని ఇది. బ్లడ్ షుగర్ విషయంలో డయాబెటిస్ రోగుల మదిలో ఎప్పుడూ ఇదే ప్రశ్న ఉత్పన్నమవుతుంటుంది. మిగిలిన వ్యాధుల సంగతేమో కానీ..మధుమేహాన్ని మాత్రం సమూలంగా నిర్మూలించవచ్చు. దీనికోసం ప్రకృతి సహజ సిద్దమైన కొన్ని పండ్లను వినియోగిస్తే మంచి పరిణామాలుంటాయి.


నేరేడు గింజలతో బ్లడ్ షుగర్ నియంత్రణ


నేరేడు గింజలతో కూడా డయాబెటిస్ రోగులకు చికిత్స ఏ విధంగానైనా నేరేడు గింజల్ని వినియోగించవచ్చు. నేరేడు గింజల్ని పౌడర్‌గా చేసుకుని...రోజూ క్రమం తప్పకుండా ఉదయం పరగడుపున గోరు వెచ్చని నీటిలో కలుపుకుని తాగితే అద్భుతమైన ఫలితాలుంటాయి. లేదా ఆ పొడితో టీ కాచుకుని కూడా తాగవచ్చు. దీనికోసం నేరేడు గింజల్ని ఎండలో ఆరబెట్టి..పూర్తి డ్రైగా మారిన తరువాత వాటిని పౌడర్ చేసుకోవాలి. ప్రతిరోజూ ఒక గ్లాసు నీటిలో ఒక స్పూన్ పౌడర్ కలుపుకుని తాగాలి. 


అంజీర్ ఆకులతో


అంజీర్ ఆకులతో కూడా డయాబెటిస్ రోగులకు లాభముంటుంది. ప్రతిరోజూ ఉదయం అంజీర్ ఆకుల్ని పరగడుపున నమిలి తినడం అలవాటు చేసుకుంటే చాలా లాభముంటుంది. అంతేకాకుండా ఈ ఆకుల్ని నీటిలో ఉడికించి కూడా ఆ నీరు తాగవచ్చు.


మెంతులతో


మెంతులతో మధుమేహ వ్యాధిగ్రస్థులకు చికిత్స అందించవచ్చు. మధుమేహం నియంత్రణలో మెంతులు అద్భుతంగా పనిచేస్తాయి. దీనికోసం రోజూ రాత్రి పూట మెంతుల్ని కొద్దిగా నీటిలో నానబెట్టి..ఉదయం పరగడుపున ఆ మెంతుల్ని అదే నీటిలో క్రష్ చేసుకోవాలి. తరువాత మెంతులతో సహా నీటిని తాగేయాలి. ఇలా చేయడం వల్ల మంచి ఫలితాలుంటాయి.


Also read: Asafoetida Benefits: అధిక రక్త పోటు సమస్యలతో బాధపడుతున్నారా.. అయితే ఇది మీ కోసమే..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.