Omicron Variant Study: ఒమిక్రాన్ వేరియంట్ కేసులకు సంబంధించి ఆసక్తికరమైన అధ్యయనం వెలువడింది. ఒమిక్రాన్ సోకిన వ్యక్తుల్లో లక్షణాలపై ఆశ్చర్యకరమైన వివరాలు వెల్లడయ్యాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Omicron Variant Study: దేశంలో క్రమంగా ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతున్నాయి. దేశంలో ఇప్పటి వరకూ 17 రాష్ట్రాల్లో 358 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకూ 114 మంది కోలుకున్నారు. ఇంకా 183 మంది చికిత్స పొందుతున్నారు. దేశంలో నమోదైన ఒమిక్రాన్ కేసుల్ని అధ్యయనం చేసినప్పుడు ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. ఒమిక్రాన్ వేరియంట్‌తో చికిత్స పొందుతున్న 183 కేసుల్ని పరిశీలించినప్పుడు..70 శాతం మందికి ఏ విధమైన లక్షణాలు లేవని తేలింది. అందులో 91 శాతం మంది పూర్తిగా వ్యాక్సినేట్ అయ్యారని..7 శాతం మంది వ్యాక్సినేట్ కాలేదని..2 శాతం మంది పాక్షికంగా వ్యాక్సినేట్ అయ్యారని తెలుస్తోంది. 


మరోవైపు ఒమిక్రాన్ వేరియంట్(Omicron Variant)సోకిన 73 శాతం కేసుల్లో విదేశీ ప్రయాణం చేసిన చరిత్ర ఉందని తేలింది. 183 కేసుల్లో 121 మంది విదేశీ ప్రయాణాలు చేశారని అధ్యయనంలో తేలింది. మిగిలిన 44 మంది ఎటువంటి విదేశీ ప్రయాణాలు చేయకుండానే ఒమిక్రాన్ వేరియంట్ బారిన పడ్డారు. 70 శాతం ఒమిక్రాన్ వేరియంట్ సోకినవారిలో 91 శాతం పూర్తిగా వ్యాక్సినేట్ అయినట్టు తెలుస్తోంది. ఇదే ఆందోళనకు కారణమవుతోంది. ఒమిక్రాన్ వేరియంట్ కేసుల్లో 61 శాతం పురుషులు కాగా, 39 శాతం మంది మహిళలున్నారు. డెల్టా వేరియంట్‌తో పోలిస్తే..ఢిల్లీలో ఒమిక్రాన్ సోకిన రోగుల్లో స్వల్ప లక్షణాలున్నాయి. కొంతమందిలో అయితే కనీసం జ్వరం వంటి లక్షణాలున్నాయని తేలింది. 34 శాతం మంది ఒమిక్రాన్ రోగుల్లో ఏ విధమైన లక్షణాల్లేవని ఢిల్లీ ఎన్ఎన్జేపీ ఆసుపత్రి డాక్టర్ సురేశ్ కుమార్ తెలిపారు. ఒకవేళ స్వల్ప లక్షణాలున్నా సరే..తేలికపాటి జ్వరం, బాడీ పెయిన్స్, జలుబుతో బాధపడ్డారు. ఏ విధమైన స్టెరాయిడ్స్, ఆక్సిజన్, యాంటీ వైరల్ మందులు లేకుండానే కోలుకున్నారు. కేవలం పారాసిటమాల్ మందులతోనే ఒమిక్రాన్ రోగులు కోలుకున్నారు. 


హాంకాంగ్‌లో నిర్వహించిన ఓ అధ్యయనంలో డెల్టా వేరియంట్‌తో(Delta Variant)పోలిస్తే ఒమిక్రాన్ వేరియంట్ 70 శాతం ఎక్కువగా సంక్రమిస్తోందని తేలింది. దీనివల్లనే ఒమిక్రాన్ వేరియంట్ అత్యంతవేగంగా సంక్రమిస్తోంది. ఊపిరతిత్తుల టిష్యూకు సంబంధించి ఒమిక్రాన్ వేరియంట్ పది రెట్లు తక్కువగా ఉంది. 


Also read: Banana Side Effects: ఆ సమస్యలతో బాధపడుతున్న వారు అరటి పండ్లు ఎక్కువ తినొద్దు..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook