Onion Chutney: కూర ఏం చేయాలో అర్థం కావడం లేదా? టెన్షన్ పడకండి..నిమిషాల్లోనే ఉల్లిపాయ చట్నీ ఇలా చేయండి
Onion Chutney Recipe: చాలా మంది మహిళలు ఇంట్లో సమయానికి కూరగాయలు లేకపోవడంతో కంగారు పడుతుంటారు. ఏం కూర చేయాలో అర్థం కాక తికమక పడుతుంటారు. అయితే టెన్షన్ పడాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఎందుకంటే కూరగాయలు లేకుండా ఉల్లిపాయలు ఉంటే చాలు. అవును ఉల్లిపాయతో టేస్టీ టేస్టీ చట్నీని రెడీ చేసుకోవచ్చు. ఈ చట్నీ తినకముందే దాన్ని చూస్తే నోంట్లో నీళ్లూరుతాయి. అయతే కేవలం పది పదిహేను నిమిషాల్లో ఉల్లిపాయ చట్నీని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
Onion Chutney Recipe: సమయానికి ఇంట్లో కూరగాయలు లేకుంటే ఎలాంటి టెన్షన్ పడకండి. ఎందుకంటే ఉల్లిపాయతో వెరైటీ చట్నీ తయారు చేయవచ్చు. దీని రుచి అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది. ఇక వేడి వేడి అన్నంలో వేసుకుంటే తింటే ఆహా ఆ రుచిని మాటల్లో వర్ణించలేము. ఈ చట్నీని అన్నంలోనే కాదు వేడి వేడి ఇడ్లీ, దోశ, వడతో కూడా తినవచ్చు. మరి మీరు కూడా ఈ చట్నీని చేయాలనుకుంటే కావాల్సిన పదార్థాలు..చేయాల్సిన విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
-పెద్ద ఉల్లిపాయలు -3
-చింతపండు కొద్దిగా
-జీలకర్ర
-పప్పు
-పచ్చిమిర్చి
-ఉప్పు రుచికి సరిపడా
-ఆవాలు
-ఎండు మిర్చి ( మీరు ఎంత కారం కావాలనుకుంటున్నారో దాని ప్రకారం తీసుకోండి)
- 2టేబుల్ స్పూన్ల నూనె
-అర చెంచా ఆవాలు
-జీలకర్ర
-కరివేపాకు రెబ్బలు
తయారీ విధానం :
ఉల్లిపాయ, పచ్చిమిర్చిని చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. గ్యాస్ పై పాన్ పెట్టి అందులో కొద్దిగా నూనె పోయాలి. ఇప్పుడు ఆవాలు,జీలకర్ర, శనగపప్పు వేసి దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసి కాసేపు వేయించుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక ప్లేటులోకి తీసుకుని చల్లారపెట్టుకోవాలి. అదే పాన్ లో ఉల్లిపాయ ముక్కలు వేసి కొంచెం నూనె పోసి రెండు నిమిషాలు వేయించుకోవాలి. ఇప్పుడు చింతపండు వేసి వేయించాలి. తర్వాత ఆవాలు, జీలకర్ర పప్పును మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. అలాగే వేయించిన ఉల్లిపాయ, రుచికి సరిపడగా ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు పాన్ లో కొంచెం నూనె పోసి వేడి చేసుకోవాలి. అందులో ఆవాలు..కావాలనుకుంటే ఇంగువ, కరివేపాకు రెబ్బలు వేయాలి. ఇప్పుడు మెత్తగా రుబ్బిన ఉల్లిని వేసి కలిపితే సరిపోతుంది. రుచికరమైన ఉల్లిపాయ చట్నీ రెడీ.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.