Papaya: బొప్పాయి తింటే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు.. అందులో ఈ 5 అతి ముఖ్యం..
Papaya Health Benefits: బొప్పాయి పండు తీసుకోవటం వల్ల ఎంతో ఆరోగ్యకరం ఎందుకంటే ఇందులో ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. బొప్పాయి డైలీ డైట్ లో చేర్చుకోవడం మహిళలకు ఎంతో పాటు అందరికీ ఆరోగ్యకరం..
Papaya Health Benefits: బొప్పాయిని తరచూ డైట్లో చేర్చుకోవాలి ఎందుకంటే ఇందులో విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇందులో విటమిన్ ఏ ఉంటుంది ఇది ముఖ్యంగా కంటి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. బొప్పాయిలో ఫోలెట్ కూడా ఉండటం వల్ల ఎంతో ఆరోగ్యకరం. అంతే కాదు ఇందులో పొటాషియం, మెగ్నీషియం కూడా పుష్కలంగా ఉంటుంది. ముఖ్యంగా బొప్పాయిలో ఉండే విటమిన్ సి వల్ల ఇమ్యూనిటీ స్థాయిలు పెరుగుతాయి. సీజనల్ జబ్బుల బారిన పడకుండా కాపాడుతుంది.
బొప్పాయిలో కీమోపపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుంది ఇందులో ఉండే ప్రోటీన్స్ వల్ల పేగు ఆరోగ్యానికి తోడ్పడుతుంది. బొప్పాయి డైట్లో చేర్చుకోవడం వల్ల ఇమ్యూనిటీ స్థాయిలు కూడా బలపడతాయి. దీనివల్ల సీజనల్ వ్యాధులు మిమ్మల్ని వెంటాడవు. ఇందులో ఉన్న విటమిన్ సీజనల్ జబ్బులు రాకుండా కాపాడుతుంది. ముఖ్యంగా జలుబు, దగ్గు రానివ్వదు. బొప్పాయిలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇందులో బీటా కెరోటీన్ లైకోపీన్ ఉంటుంది. ఇది ఇన్‌ఫ్లమేషన్, ఆక్సిడేటివ్ డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది.
అంతేకాదు గుండె సంబంధించిన సమస్యలు కూడా మీ దరిచేరవు. చర్మ ఆరోగ్యానికి బొప్పాయి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఉండే విటమిన్ సీ, యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్ డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది. మీ చర్మం కూడా మెరుస్తుంది. అంతేకాదు ఆరోగ్యకరమైన చర్మానికి సౌందర్య పరంగా కూడా బొప్పాయి ఎంత ఉపయోగపడుతుంది బొప్పాయితో ఫేస్ మాస్క్ కూడా ఉపయోగించవచ్చు దీంతో మీ చర్మం బంగారు వర్ణంలోకి మారిపోతుంది.
ఇదీ చదవండి: Okra water: బెండకాయ నీటితో జుట్టు ఇలా కడిగితే ఎంత లాగినా ఊడదంటే నమ్మండి..
బొప్పాయిని తింటూ బరువు కూడా సులభంగా తగ్గించుకోవచ్చు. ఎందుకంటే ఇందులో ఫైబర్ ఉంటుంది. కాబట్టి కడుపు నిండిన అనుభూతి ఎక్కువగా కలుగుతుంది అతిగా తినకుండా ఉంటారు. ఇందులో క్యాలరీల శాతం కూడా తక్కువగా ఉంటుంది. స్నాక్స్ రూపంలో తీసుకుంటే మరింత ప్రయోజనకరం అనారోగ్యకరమైన ఫుడ్ తినకుండా ఉంటాం ఆరోగ్యకరంగా బరువు నిర్వహిస్తుంది..
బొప్పాయిలో ఉండే విటమిన్ ఏ వల్ల కంటి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. దీంతో వయస్సు రీత్యా వచ్చే కంటి జబ్బులు మీ దరిచేరకుండా ఉంటాయి. బొప్పాయిలో ఉండే బయో ఆక్టివ్, యాంటీఇన్‌ఫ్లమేటరీ గుణాలు మంట సమస్యను తగ్గిస్తుంది. ఇది డయాబెటిస్ వారికి కూడా మేలు చేస్తుంది. బొప్పాయి లోనే ఉండే ఎంజైమ్ కడుపు సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది. మహిళలకు ఇది ఎంతో వరం ముఖ్యంగా బొప్పాయి తీసుకోవడం వల్ల క్యాన్సర్ కు వ్యతిరేకంగా పోరాడుతుంది. ఇందులో ఫైటో కెమికల్స్ ఉండటం అంటే ఆక్సిడెంట్ గుణాలు కలిగి ఉండటం వల్ల క్యాన్సర్ కణాలు ఉత్పత్తి కాకుండా యాంటీగా పోరాడుతుంది... ఫ్రీ రాడికల్ డామేజ్ కాకుండా క్యాన్సర్ కణాలు పెరగకుండా తోడ్పడుతుంది..
ఇదీ చదవండి: Red Fruits: ఈ 5 ఎర్రని పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు.. గుండె జబ్బుల జాడే ఉండదు...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter