Fruit Cures Jaundice: సాధారణంగా కామెర్లు వస్తే సమయానికి నయం కాకపోతే ప్రాణాలు పోయే పరిస్థితి ఉంటుంది. కామెర్లు కిడ్నీ వ్యాధుల వల్ల వస్తాయి. దీనికి కొన్ని నియమాలు ఉంటాయి. వాటిని పాటించి కామెర్ల వ్యాధులను తగ్గించుకుంటారు. కామెర్ల లక్షణాలు ముఖ్యంగా కళ్లలో కనిపిస్తాయి. అంటే కళ్లు పచ్చగా మారిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే, ఈ వ్యాధిని నయం చేయడానికి పండ్లు కూడా ఉన్నాయి. ఈ ఎర్రటి పండు కామెర్ల వ్యాధికి చెక్ పెడుతుందంటే నమ్ముతారా?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మనం మార్కెట్లో విస్తృతంగా చూసే పండ్లు యాపిల్, దానిమ్మ. దానిమ్మ అతి తక్కువ ధరలోనే అందుబాటులో ఉంటుంది. ఇది రక్తం కూడా పోసే పండు అని అందరికీ తెలుసు. అయితే, ఇది కామెర్లను కూడా నయం చేస్తుందని మీకు తెలుసా? నిజానికి దానిమ్మ మాత్రమే కాదు దాని తొక్కలో కూడా ఔషధ గుణాలుంటాయి. ఆయుర్వేదంలో కూడా విస్తృతంగా వినియోగిస్తారు. పిల్లలు, పెద్దలు ప్రతిఒక్కరూ ఈ పండును తినడానికి ఇష్టపడతారు. ఇందులోని విటమిన్లు, పోషకాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.


ఈ పండులో ముఖ్యంగా మెగ్నిషియం, సెలీనియం, జింక్ ఉంటుంది. అందుకే దానిమ్మ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అయితే, ఇప్పటి వరకు మనం దానిమ్మ పండు దాని తొక్క గురించి మాట్లాడుకున్నాం. దాని ఆకుల ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా? ఈ దానిమ్మ ఆకులతో కామెర్ల వ్యాధికి చెక్ పెట్టొచ్చు. వీటి ఆకులతో తయారు చేసిన కషాయం తీసుకోవడం వల్ల కామెర్లు తగ్గిపోతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కేన్సర్ కణాలను సైతం నయం చేసే గుణం ఈ దానిమ్మ ఆకులకు ఉంది.


ఇదీ చదవండి: ఎర్రబియ్యంతో ఎన్నో రోగాలు మాయం.. ఈ రైస్ ప్రతి అవయవాన్ని రిపెయిర్ చేస్తుంది..


అంతేకాదు ఈ దానిమ్మ ఆకులతో కషాయం చేసి తీసుకోవడం వల్ల దీర్ఘకాలిక జలుబు, దగ్గు సమస్యల నుంచి బయటపడతారు. దీంతో రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. దానిమ్మ ఆకులను ఆయుర్వేదంలో కూడా విస్తృతంగా వినియోగిస్తారు. ఈ కాలంలో ఎక్కువశాతం నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. ఇది విపరీతమైన స్ట్రెస్, ఇతర ఆరోగ్య కారణాలు. మీరు కూడా నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నట్లయితే దానిమ్మ ఆకులను నీటిలో మరిగించాలి. మనం పోసిన నీటికి అది సగం అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఈ నీటిని రోజుకు రెండుసార్లు తాగాలి. ఇలా చేయడం వల్ల కామెర్లు, నిద్రలేమి సమస్యకు కూడా చెక్ పెట్టొచ్చు. 


ఇదీ చదవండి: పప్పు, చారు మంచింగ్‌కు పర్ఫెక్ట్ స్నక్స్ ఈ వడియాలు..!


దానిమ్మ ఆకులతో కషాయం మరో విధంగా కూడా తయారు చేసుకోవచ్చు. ఈ దానిమ్మ ఆకులను ఎండబెట్టి పొడిచేసుకోవాలి. వీటిని నీటిలో వేసుకుని మరగకాచి తాగాలి. ప్రాస్టేట్ కేన్సర్‌కు చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter