కరోనా వైరస్‌ (CoronaVirus)కు వ్యాక్సిన్ వచ్చేంతవరకూ తగిన జాగ్రత్తలు పాటించడం తప్ప.. వేరే మార్గం లేదు. ముఖ్యంగా ఇది ఇతరులు దగ్గినప్పుడు విడుదలయ్యే లాలాజలం మన కళ్లలోకి ప్రవేశించడం ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుంది. మరోవైపు మాస్కు ధరించి బయటకు వెళ్లాలని, కనీసం ఆరు అడుగుల భౌతిక దూరాన్ని (Social Distance) పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. Remedies for Knee Pain: మోకాళ్ల నొప్పులు బాధిస్తున్నాయా.. ఇలా చేస్తే సరి


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా వైరస్ కళ్లద్వారా సైతం మన శరీరంలోకి ప్రవేశిస్తుందని తెలిసిందే. ప్రపంచంలోని ప్రముఖ వైద్య నిపుణులు సలహా ఏంటంటే.. బయటకు వెళ్లినప్పుడు మాస్కుతో పాటు కళ్లద్దాలు ధరించడం ఉత్తమమని సూచిస్తున్నారు. కళ్లద్దాలు ధరిస్తు్న్న వారిలో కోవిడ్19 (COVID19) బారిన పడిన కేసులు స్వల్పంగా ఉన్నాయని చైనా అధ్యయనాలు చెబుతున్నాయి. జామా ఆప్తమాలజీ (Jama Opthalmogy) ప్రచురించిన జర్నల్‌లో ఈ వివరాలు వెల్లడించారు. Remedies for Piles: పైల్స్ సమస్యకు ఈ చిట్కాలు పాటించండి


చైనాలోని సూజౌ ప్రాంతంలో కరోనా కేసులు కొన్ని పరిశీలించగా ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. రోజువారీ కళ్లద్దాలు ధరించే వారితో పోల్చితే కళ్లద్దాలు ధరించని వారికి కరోనా ముప్పు 6 రెట్లు అధికంగా ఉందట. కళ్లద్దాలు ధరించేవారిలో 5.8 శాతం మందికి కరోనా సోకితే కళ్లద్దాలు లేని వారిలో 31.5శాతం మంది కోవిడ్19 బారిన పడ్డట్లు గుర్తించారు. కళ్లను పదే పదే తాకడం ద్వారా తమకు తెలియకుండానే చేతిలో ఉన్న వైరస్ కంటి ద్వారా శరీరంలోకి ప్రవేశించడమే అందుకు కారణమని చెబుతున్నారు. Monsoon Diet; వానాకాలంలో ఈ కూరగాయలు తినాలి.. అసలే కరోనా ఉంది


కరోనా వ్యాప్తికి కళ్లు వాహకాలుగా పనిచేస్తున్నాయని, కంటి కోసం జాగ్రత్తలు తీసుకుంటే వైరస్‌ను కొద్దిమేర నియంత్రించవచ్చునని జర్నల్‌లో పేర్కొన్నారు. కనుక కళ్లద్దాలు ధరించి బయటకు వెళ్లడం ద్వారా కరోనా బారిన పడే ముప్పు చాలా వరకు తగ్గుతుందని, ప్రజలు ఇది పాటించడం ఉత్తమమని చైనా రీసెర్చర్స్ సూచించారు. కంటిని తాకడం, తుడుచుకోవడం లాంటివి చేయవద్దని సైతం హెచ్చరిస్తున్నారు. Health Tips: కరోనా సమయంలో ఒత్తిడిని జయించాలి.. ఎందుకంటే!