Pink Himalayan Salt: పింక్ సాల్ట్ వాడుతున్నారా..దాని ప్రయోజనాలు తెలుసుకోండి.!!
Pink Himalayan Salt: ప్రస్తుతం పింక్ సాల్ట్(Pink Himalayan Salt) ఉపయోగించే వారి సంఖ్య క్రమ క్రమంగా పెరుగుతోంది. ఈ ఉప్పును వినియోగించడం వల్ల ఆరోగ్యానికి మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
Pink Himalayan Salt: ప్రస్తుతం పింక్ సాల్ట్(Pink Himalayan Salt) ఉపయోగించే వారి సంఖ్య క్రమ క్రమంగా పెరుగుతోంది. ఈ ఉప్పును వినియోగించడం వల్ల ఆరోగ్యానికి మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ ఉప్పను నేరుగా హిమాలయాలలోని పలు స్పటికాలలో తయారు చేసి శుద్ధి చేసి భారత్‌లోని వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. అందుకే దీనికి హిమాలయన్ సాల్ట్‌గా పేరు వచ్చింది. ఇందులో అయోడిన్ శాతం అధికంగా ఉంటుంది. దీని ద్వారా శరీరానికి అనేక ప్రయోజనాలు లభిస్తాయి. అంతే కాకుండా ఈ ఉప్పును భారత్‌తో సహా పాక్, నేపాల్ ఇతర దేశాల్లో ఉత్పత్తి చేస్తున్నాయి. ఈ ఉప్పు చూడడానికి పింక్(తేత గులాబి ) కలర్‌ను పోలి ఉంటుంది. ప్రస్తుతం భారత్‌లో ఈ ఉప్పు చాలా అరుదుగా లభిస్తుంది. అంతే కాకుండా ఈ ఉప్పుకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉండడం వల్ల అధిక రేటుతో విక్రయిస్తున్నారు.
పింక్ సాల్ట్‌లో మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం, జింక్ శాతం అధికంగా ఉంటుంది. కావున శరీరానికి ఇవి మేలు చేస్తాయి. ప్రస్తుతం మార్కెట్‌లో లభించే ఉప్పు వల్ల బ్లడ్ ప్రెజర్, స్ట్రోక్, గుండె వంటి సమస్యలు వస్తున్నాయి. కావున అందరు ఈ పింక్ సాల్ట్‌ను తినడానికి ఎక్కువగా అసక్తి చూపుతున్నారు. అయితే పలువురు పరిశోధకులు తెలిపిన వివరాల ప్రకారం ఇందులో చాలా రకాల విటమిన్లు, పోషకాలు ఉన్నాయని వారు పేర్కొన్నారు. పింక్ సాల్ట్ తినడం ద్వారా ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయో తెలుసుకుందాం..
పింక్ సాల్ట్‌తో ఇన్ని ప్రయోజనాలా..!
#పింక్ సాల్ట్ శరీరంలోని సోడియం స్థాయిని అదుపులో ఉంచి..అతిదాహం కాకుండా చేస్తుంది
#రక్త పోటును నియంత్రించేందుకు..హార్మోన్ల స్థాయిలను సమానంగా ఉంచేందుకు సహాయపడుతుంది
#శరీరంలోని వ్యర్థాలను తొలగించి..నీటి శాతాన్ని క్రమబద్దీకరిస్తుంది
#చర్మాన్ని మెరుగుపరుస్తుంది
#శ్వాసకోస వ్యవస్థ సక్రమంగా పని చేసేలా చేస్తుంది
పింక్ సాల్ట్‌తో నష్టాలు:
#దీనితో అధిక రక్తపోటు సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి
#ప్రమాదకరమైన అర్సెనిక్, మెర్క్యూరీ ఉండడంతో శరీరానికి హాని చేస్తాయి.
#ఎముకల వ్యాధి వచ్చే అవకాశాలున్నాయి
#గుండె వ్యాధులకు దారితీయొచ్చు
Also Read: Gourd Benefits: సొరకాయతో శరీరానికి ఇన్ని ప్రయోజనాలా..!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook