Diabetes Control Tips: గుమ్మడికాయ గింజలతో ఇలా చేస్తే ఇంకో సారి మధుమేహం దరిదాపుల్లోకి రాదు..
Pumpkin Seeds For Diabetes Control: చాలా మందికి గుమ్మడికాయ గురించి తెలుసు కానీ గుమ్మడికాయ గింజలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయని తెలియదు. అయితే ఇందులో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు లభిస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల అన్ని రకాల సమస్యలు దూరమవుతాయి. ముఖ్యంగా మధుమేహం, రోగనిరోధక సమస్యలు దూరమవుతాయి.
Pumpkin Seeds For Diabetes Control: గుమ్మడికాయలను భారతీయులు వంటకాల్లో వినియోగిస్తారు. వీటితో వివిధ రకాల వంటకాలను చేస్తారు. కాబట్టి ఇది మార్కెట్‌లో విచ్చల విడిగా లభిస్తుంది. అయితే గుమ్మడికాయల్లో ఉండే మూలకాలు శరీరానికి చాలా రకాలుగా మేలు చేస్తుంది. అయితే గుమ్మడే కాకుండా అందులో ఉండే విత్తనాలు కూడా శరీరానికి చాలా రకాలుగా మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. వీటిల్లో ఉండే గింజలు శరీరంలో ఉండే వివిధ రకాల అనారోగ్య సమస్యలను దూరం చేస్తాయి. ముఖ్యంగా మధుమేహంతో బాధపడేవారికి ఇవి చాలా ప్రభావవంతంగా పని చేస్తాయి. అయితే ఈ గింజలను ఎలా వినియోగించాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
గుమ్మడికాయ గింజలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు:
>>చాలా మంది వివిధ రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా జీవన శైలి కారణంగా చాలా మంది ఒత్తిడికి గురవుతున్నారు. అయితే ఒత్తిడి కారణంగా వివిధ రకాల అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. ఈ సమస్య నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి గుమ్మడికాయ గింజలను వినియోగించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో శరీరానికి అవసరమయ్యే చాలా మెగ్నీషియం వంటి పోషకాలు లభిస్తాయి. కాబట్టి వీటిని ఆహారంలో భాగంగా తీసుకుంటే అన్ని రకాల సమస్యలు దూరమవుతాయి.
>>ప్రస్తుతం అనుసరిస్తున్న జీవన శైలి కారణంగా నిద్రలేమి సమస్యలు ఎక్కువతున్నాయి. అయితే చాలా మంది అర్ధరాత్రి సడెన్‌గా నిద్ర లేస్తున్నారు. ఇలాంటి సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొండానికి పలు ఆహారంలో ఈ గింజలను వినియోగించాలని నిపుణులు తెలుపుతున్నారు.
>>డయాబెటిక్ పేషెంట్లు తప్పనిసరిగా గుమ్మడి గింజలను తినాలి. అందులో ఉండే ఫైబర్ టైప్ 2 డయాబెటిస్ నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కాబట్టి తప్పని సరిగా ఈ విత్తనాలను తీసుకోవాల్సి ఉంటుంది.
>>గుమ్మడికాయ గింజలను క్రమం తప్పకుండా తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తిని పెరుగుతుంది. అంతేకాకుండా తీవ్రమైన వ్యాధులన్నీ దూరమవుతాయి. కాబట్టి శరీరంలో రోగనిరోధక శక్తి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ గింజలను వినియోగించండి.
(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, దయచేసి వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Gujarat Bus Accident: వడోదరలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం..
Also Read: Gujarat Bus Accident: వడోదరలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook