Sadguru Jaggi Vasudev Brain Surgery:ఆధ్యాత్మిక గురువు అయిన సద్దురు జగ్గీవాసుదేవ్‌కు బ్రెయిన్ సర్జరీ అయింది. ఆయనకు మెదడులో రక్తస్రావం జరగడంతో ఈ సర్జరీ చేశారు. అసలు ఆయనకు ఏం జరిగింది? ఆ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సద్దురు జగ్గీవాసుదేవ్‌కు ఇటీవలె ఇంద్రప్రస్త న్యూఢిల్లీ అపోలో ఆస్పత్రిలో సర్జరీ చేశారు. ఆయన మెదడులో రక్తస్రావం వల్ల ఈ సర్జరీ చేశారని సంబంధిత వైద్యులు చెబుతున్నారు. ఇప్పుడు సద్గురు కోలుకుంటున్నారు. ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయో వైద్యులు చెప్పిన లక్షణాలను తెలుసుకుందాం.సాధారణంగా మెదడులో రక్తస్రావం ఎందుకు జరుగుతుందంటే రక్తనాళాలు ఒత్తిడికి లోనై బలహీనపడినప్పుడు ఇలా జరుగుతుందట. దీన్నే హెమరేజ్ స్ట్రోక్ అంటారు.


ఈ వ్యాధి లక్షణాలు..
తీవ్రమైన తలనొప్పి ఈ వ్యాధి ప్రధాన లక్షణం. దీనిపై ఏమాత్రం అలసత్వం వహించకూడదు.
శరీరం అంతా పూర్తిగా ఒకవైపు మొద్దుబారినట్లు అనిపిస్తుంది. అంతేకాదు బాగా బలహీనత ఈ వ్యాధి లక్షణంలో మరోటి.
ఈ లక్షణం ఎవరికైఆన రావచ్చని వైద్యులు చెబుతున్నారు. వీటిలో ఏ ఒక్క లక్షణం కనిపించినా వెంటనే వైద్యుని సంప్రదించాలి.


ఇదీ చదవండి: పరగడుపున తులసి నీరు తాగితే ఈ సమస్యలు అన్ని పరార్!


హేమరేజ్ కారణాలు..
ఈ స్ట్రోక్ రావడానికి ప్రధాన కారణం దీర్ఘకాలిక రక్తపోటు వల్ల కావచ్చు.
కొంతమంది బరువు ఎక్కువగా ఉంటారు. వారిలో కూడా ఈ వ్యాధి కనిపిస్తుంది. 
ముఖ్యంగా అధిక కేలరీలు ఉన్న ఆహారం తీసుకున్నా ఈ వ్యాధి సంభవిస్తుంది.
మరికొందరిలో స్మోకింగ్ వల్ల కూడా ఈ వ్యాధికి గురికాక తప్పదు.


 






ఇదీ చదవండి: మగవాళ్లకు డయాబెటిస్ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా? 


సద్దురు జగ్గీవాసుదేవ్ కూడా తీవ్రమైన తలనొప్పిని అనుభవించాడు. మొదటగా వచ్చినప్పుడు నిర్లక్ష్యం చేశారు. మరుసటి రోజు ఈ విధంగానే తీవ్ర తలనొప్పి రావడంతో ఆస్పత్రిలో చేర్పించి సర్జరీ చేశారు. ఈ వ్యాధి ఎంఆర్‌ఐ, సీటీ స్కాన్‌ల ఆధారంగా బయటపడుతుంది. సద్గురుకు వైద్యులు వెంటనే వైద్యం చేయాలని సూచించగా ఆయన ఈవెంట్లలో బిజీగా ఉండటం వల్ల ఇలా ఆలస్యమైంది. గత 40 ఏళ్లలో ఆయన ఏ ఒక్క ఈవెంట్ కూడా మిస్సవ్వలేనని వైద్యులతో చెప్పారట. కానీ, మార్చి 17న పరిస్థితి విషమించడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు.


 


సర్జరీని డాక్టర్ ఎస్‌ ఛటార్జీ, డాక్టర్ వినిత్ సూరి, డాక్టర్ ప్రణావ్ కుమార్, డాక్టర్ సుధీర్ త్యాగీ చేశారు. సర్జరీ తర్వాత సద్దురు జగ్గీ వాసుదేవ్ కూడా ఓ వీడియోను ట్వీట్టర్ వేధికగా పంచుకున్నారు.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter