Diabetes Symptoms in Men: మగవాళ్లకు డయాబెటిస్ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా? 

Diabetes Symptoms in Men: డయాబెటిస్‌తో బాధపడేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇది చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరినీ వేధిస్తోంది.అయితే, మధుమేహం లక్షణాలు అందరిలో ఒకేవిధంగా ఉండదు.

Written by - Renuka Godugu | Last Updated : Mar 20, 2024, 02:51 PM IST
Diabetes Symptoms in Men: మగవాళ్లకు డయాబెటిస్ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా? 

Diabetes Symptoms in Men: డయాబెటిస్‌తో బాధపడేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇది చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరినీ వేధిస్తోంది.అయితే, మధుమేహం లక్షణాలు అందరిలో ఒకేవిధంగా ఉండదు. మగవారిలో ఒకవిధంగా, ఆడవారిలో మరో విధంగా ఉంటుంది. సాధారణంగా మధుమేహం లక్షణాలు గాయాలు మానకపోవడం, దురద ఎక్కువగా అనిపించడం, బరువు తగ్గడం వంటివి కనిపిస్తాయి. అయితే, మధుమేహాన్ని ప్రారంభ దశలోనే గుర్తిస్తే దాన్ని సులభంగా నియంత్రించవచ్చు. దాన్ని ముందుగానే గుర్తించాలంటే మగవాళ్లలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అవేంటో తెలుసుకుందాం.

తిమ్మిర్లు..
మధుమేహంతో బాధపడే మగవారిలో ప్రారంభ లక్షణాలు కాళ్లలో, చేతుల్లో తిమ్మిర్లు అనుభవించడం జరుగుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు అధికంగా పెరిగినప్పుడు ఇలా తిమ్మిర్లు వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఈ లక్షణం కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఈ లక్షణం ముఖ్యంగా పడుకున్నప్పుడు అనుభవిస్తారు.

నరాలు దెబ్బతినడం..
మగవారిలో కనిపించే మరో మధుమేహ లక్షణం కాళ్లల్లో అలజడిగా అనిపించడం. నరాలు దెబ్బతినడం వల్ల కాళ్లలో స్పర్శ కోల్పోవడం. ఒక్కోసారి కాళ్లకు గాయాలు కావడం, అవి మానకపోవడం వంటివి జరుగుతాయి. డయాబెటిస్‌తో బాధపడేవారికి ప్రారంభ దశలో ఇలా కాళ్లకు గాయాలు ఏవైనా అయినా కానీ, వారికి తెలియకుండా ఉంటుంది. 

ఇదీ చదవండి: ఓవెన్ లేకుండా ఇంట్లోనే పిజ్జా తయారు చేసుకోవచ్చు..!

చర్మం..
డయాబెటిస్ మరో ప్రధాన లక్షణం చేతులు, కాళ్లు, వీపులో దురదగా ఉంటుంది. చర్మం పొడిబారడం వల్ల దురదలు వస్తాయి. అవి ఎక్కువ రోజులు ఉంటుంది. త్వరగా మానదు. డయాబెటిస్‌తో బాధపడేవారికి డీహైడ్రేషన్ సమస్య వస్తుంది. దీంతో కూడా చర్మం దురదగా అనిపిస్తుంది.

గాయాలు మానవు..
మగవారిలో కనిపించే మరో డయాబెటిస్ ప్రారంభ లక్షణం త్వరగా గాయాలు మానకపోవడం. సాధారణంగా ఏవైనా గాయాలైనప్పుడు సాధారణంగా నాలుగురోజుల్లో మానిపోతుంది. కానీ, డయాబెటిస్ సమస్య ఉన్నవారికి గాయాలు మానవు. అది ఎప్పుడు పచ్చిగానే ఉంటుంది. ఇలా కనిపిస్తే వెంటనే వైద్యులను కలవడం నయం.

ఇదీ చదవండి: ఫాస్ట్‌గా బరువు తగ్గాలనుకుంటున్నారా? మీ డైట్‌లో ఈ తామర పువ్వుల వేర్లను వినియోగించండి!

అరికాళ్ల మంట..
రక్తంలో చక్కెర స్థాయిలు అధికంగా ఉన్నవారికి అరికాళ్లలో మంట అనుభూతి కలుగుతుంది. ఇది మగవారిలో కనిపించే ప్రధాన డయాబెటిస్ లక్షణం. ఇది నిద్రలేమికి కూడా దారితీస్తుంది. ఈ లక్షణం కనిపించినా వైద్యులను సంప్రదించడం మేలు. ఈ ఒక్క లక్షణం మాత్రమే కాదు ఏ ఆరోగ్య సమస్య అయినా పదిహేను రోజులకంటే ఎక్కువగా కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఏ ఆరోగ్య సమస్య అయినా ప్రారంభంలోనే అరికట్టడానికి ప్రయత్నించాలి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News