Iodine Deficiency: శరీరంలో అయోడిన్ తగ్గితే ఇంత నష్టమా? ఈ లక్షణాలు కనిపిస్తే తస్మాత్ జాగ్రత్త !
Iodine Deficiency Foods: మన శరీరానికి బాగా అత్యవసరమైన పోషకాలలో.. ప్రోటీన్, విటమిన్ సి, విటమిన్ డి, కార్బోహైడ్రేట్స్, మొదలగు వాటితో పాటు అయోడిన్ కూడా చాలా ముఖ్యం. శరీరంలో అయోడిన్ శాతం.. తగ్గడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. కానీ చాలామందికి అయోడిన్ యొక్క అవసరం తెలియదు. ఒకవేళ శరీరంలో కావలసిన.. అయోడిన్ శాతం లేకపోతే ఎలాంటి లక్షణాలు ఎదురవుతాయి.. ఒకసారి చూద్దాం పదండి..
Iodine Deficiency Symptoms: మన శరీరంలోని ప్రతిభాగం పని చేయడానికి… ఎన్నో పోషకాలు కావాల్సి ఉంటుంది. అందులో ఒకటి తగ్గినా కూడా ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. ఇక మన శరీరానికి బాగా కావాల్సిన అత్యవసర పోషకాలలో.. అయోడిన్ కూడా ఒకటి. శరీరంలో తగినంత అయోడిన్ లేకపోతే ఎన్నో సమస్యలు తలెత్తుతాయి.
అయోడిన్ వల్ల ఉపయోగాలు:
అసలు ఈ అయోడిన్ మనకి ఎందుకు కావాలి అంటే.. ముఖ్యంగా మన బ్రెయిన్ డెవలప్మెంట్ కోసం అని చెప్పుకోవచ్చు. మన మెదడు పనితీరు.. బాగుండాలన్నా, మెదడు పనితనం మెరుగ్గా అవ్వాలన్నా కూడా.. అయోడిన్ కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా అయోడిన్.. మన థైరాయిడ్ స్థాయిని కూడా ప్రభావితం చేస్తుంది. సరైన అయోడిన్ అందకపోతే థైరాయిడ్ స్థాయి విపరీతంగా పెరిగిపోతుంది. మరోవైపు అయోడిన్ కారణంగా మెటబాలిజం కూడా మెరుగ్గా ఉంటుంది.
తగినంత అయోడిన్ లేకపోతే ఏమవుతుంది?
ఒకవేళ ఆ మన శరీరంలో.. కావాల్సిన అయోడిన్ అందకపోతే దాని డెఫిషియన్సీ కనిపిస్తుంది. అయోడిన్ తగ్గుతున్న సమయంలోనే.. మన శరీరం మనకి కొన్ని సంకేతాలు కూడా అందిస్తుంది. ఆ సంకేతాలను బట్టి కూడా మనం యూరిన్ టెస్ట్ ద్వారా మన బాడీలో ఉన్న అయోడిన్ స్థాయిని చెక్ చేసుకోవచ్చు.
అయోడిన్ తగ్గిందని మన శరీరం మనకి ఇచ్చే సంకేతాలు ఏంటో చూద్దాం.
బరువు పెరిగిపోవడం:
అయోడిన్ స్థాయి తక్కువగా ఉంటే.. మెటబోలిజం కూడా.. తక్కువగా దీనివల్ల మనం తిన్న ఆహారం క్యాలరీస్ గా మారి శరీరానికి కావలసిన శక్తిని ఇవ్వవు. జీర్ణ క్రియ కూడా సరిగ్గా జరగక.. కొంచెం ఆహారం తిన్నా కూడా త్వరగా బరువు పెరిగిపోతూ ఉంటాం.
అలసటగా లేదా నీరసంగా అనిపించడం:
అయోడిన్ తక్కువగా ఉన్న సమయంలో.. మన శరీరం కి కావాల్సిన శక్తి కూడా అందదు. దానివల్ల ఎప్పుడూ బాగా నీరసంగా ఉన్నట్టు, బాగా చిరాకుగా, వీక్ గా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది.
జుట్టు రాలిపోవడం:
మన బాడీకి కావాల్సిన అయోడిన్ అందకపోతే.. జుట్టు పెరుగుదల కూడా దెబ్బతింటుంది. జుట్టు ఆరోగ్యాంగా పెరగడానికి కావాల్సిన పోషకాల్లో.. అయోడిన్ కూడా ఒకటి. అది తగ్గితే జుట్టు కూడా ఎక్కువగా రాలిపోతూ ఉంటుంది.
థైరాయిడ్:
అయోడిన్ స్థాయి తక్కువ అవడం వల్ల.. థైరాయిడ్ చాలా ఎక్కువగా అయిపోతుంది. దానివల్ల హైపో థైరాయిడిజం వ్యాధి.. కూడా వచ్చే అవకాశం ఉంటుంది.
చర్మం పొడి పారిపోవడం:
అయోడిన్ తక్కువగా ఉన్నప్పుడు చర్మ ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. స్కిన్ బాగా పొడి పారిపోయినట్లు అనిపిస్తూ ఉంటుంది. దానివల్ల దురదలు వచ్చి.. చర్మం చాలా త్వరగా పాలిపోతూ ఉంటుంది.
చలి పెరగడం:
అయోడిన్ డెఫిషియన్సీ కారణంగా.. శరీరపు ఉష్ణోగ్రతలో కూడా మార్పులు వస్తాయి. దీనివల్ల కొన్నిసార్లు బాగా చలిగా అనిపించటం జరుగుతుంది.
కళ్ళు తిరగడం:
శరీరంలో కావాల్సిన అయోడిన్ అందకపోతే.. గుండె వేగం కూడా బాగా పెరుగుతుంది. దీనివల్ల మనకి కళ్ళు తిరగడం, ఒంట్లో బాగోలేనట్టు అనిపిస్తూ ఉండటం వంటివి జరుగుతూ ఉంటాయి.
మతిమరుపు:
మెదడు పనితీరు విషయంలో కూడా అయోడిన్ కీలక పాత్ర.. పోషిస్తుందని ఇప్పటికే చెప్పుకున్నాం. మరి కావాల్సిన అందకపోతే.. మెదడు ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ముఖ్యంగా చిన్న చిన్న పనులు కూడా మర్చిపోతూ ఉండటం, ఏదైనా నేర్చుకోవడం కష్టంగా అనిపిస్తూ ఉండటం.. వంటివి జరుగుతాయి.
గర్భ సమస్యలు:
గర్భిణీ స్త్రీలకు అయోడిన్ చాలా ముఖ్యమైనది. కానీ చాలా వరకు గర్భిణీలలో.. అయోడిన్ డెఫిషియన్సీ ఎక్కువగా కనిపిస్తుంది. దానివల్ల కడుపులో పెరుగుతున్న బిడ్డ.. ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. అయోడిన్ లేమి కారణంగా వచ్చే హైపో థైరాయిడిజం వల్ల.. గర్భ శ్రావం జరిగే అవకాశం కూడా ఉంటుంది.
Read more: Viral video: ఒరేయ్.. ఎవర్రా మీరంతా.. వర్షం బురద నీళ్లను వదలరా.. వైరల్ గా మారిన వీడియో..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter