Dark Circles of Eye: ఆధునిక జీవనశైలిలో..పోటీ ప్రపంచంలో అనారోగ్య సమస్యలు ఎక్కవవుతున్నాయి. మానసిక ఒత్తిడి కావచ్చు..నిద్రలేమి కావచ్చు కంటి కింద నల్లటి వలయాలు వస్తున్నాయి. వీటిని ఎలా దూరం చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


మనిషి అందానికి వన్నె తెచ్చేవి కళ్లు మాత్రమే. ఆ కంటి కింద నల్లటి వలయాలు ( Dark Circles ) ఏర్పడటం ఇటీవల కాలంలో అధికమౌతున్న సమస్య. నిద్రలేమి కావచ్చు..విపరీతమైన అలసట కావచ్చు..పని కారణంగా మానసిక ఒత్తిడి ( Work pressure ) కావచ్చు. కారణం ఏమైనప్పటికీ నల్లటి వలయాలు అందవికారంగా కన్పిస్తుంటాయి. వీటిని తగ్గించుకునేందుకు వివిధ రకాల క్రీమ్స్ రాయడం, ఐస్‌క్యూబ్స్ , ఖీరా వంటివి పెట్టుకోవడం చాలానే చేస్తుంటాం. ఇలా కాకుండా రోజువారీ తీసుకునే ఆహారంలో కొన్ని పదార్ధాల్ని చేర్చడం ద్వారా కంటి కింద ఏర్పడే నల్లటి వలయాల్ని తగ్గించుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. 


టొమాటో ( Tomato ) పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు ( Anti oxidants ) పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తనాళాలను కాపాడుతూ..బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతాయి. ఫలితంగా కంటి కింద బ్లాక్ రింగ్స్ తగ్గుతాయి. మరో ముఖ్యమైన పదార్ధం ఖీరా. ఇందులో అధికంగా ఉండే నీటిశాతంతో శరీరంలో వేడిని తగ్గిస్తుంది. చలువ చేసి..చర్మ సమస్యలు రాకుండా చేయడమే కాకుండా చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది. 


Also read: Vaccination tips: వ్యాక్సిన్ వేయించుకున్నాక...ఏం చేయాలి..ఏం చేయకూడదు


ఇక రోజూ పుచ్చకాయ ( Water melon ) తినడం వల్ల కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. కంటి కింద నల్లటి వలయాలున్నవారు తింటే మరీ మంచిది. మరో ముఖ్యమైంది నల్ల ద్రాక్ష ( Black grapes ). ఇందులో ఉండే ఒమేగా 3 లాంటివి డార్క్ సర్కిల్స్‌ను తగ్గిస్తాయి. విటమిన్ ఇ ఎక్కువగా ఉండే బాదం, పీనట్స్, పొద్దు తిరుగుడు గింజలు తినడం ద్వారా కూడా వీటిని తగ్గించుకోవచ్చు.


మీరు తినే ఆహారంలో ఏదో రంగా ఆకుకూరల్ని ( Leafy vegetables ) చేరిస్తే..కంటి చూపు మెరుగు పడటంతో పాటు..చుట్టూ ఉండే బ్లాక్ సర్కిల్స్ తగ్గిపోతాయి. నారింజలో ఉంటే విటమిన్ సి, విటమిన్ ఎ  కారణంగా డార్క్ సర్కిల్స్ పోగొట్టుకోవచ్చు.


ఇక  బీట్‌రూట్ ( Beetroot ) తరచూ తినడం ద్వారా బెటాలిన్ యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని డీటాక్సిఫై చేసి..కంటి ఆరోగ్యాన్ని కాపాడుతాయి. మరీ ముఖ్యంగా కంటి కింద ఉండే బ్లాక్ సర్కిల్స్ దూరం చేసే లక్షణాల బీట్‌రూట్‌లో ఉన్నాయి. ఇక బొప్పాయి ( Papaya ) గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇందులో ఉండే బ్లీచింగ్ ఏజెంట్ చర్మాన్ని శుభ్రంగా కాంతివంతంగా మార్చేందుకు సహాయపడుతుంది. 


Also read; Hemoglobin: ఐరన్ లోపాన్ని ఎలా అధిగమించాలి? ఐరన్ తక్కువుంటే ఏమవుతుంది?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook