Vaccination tips: వ్యాక్సిన్ వేయించుకున్నాక...ఏం చేయాలి..ఏం చేయకూడదు

  • Jan 16, 2021, 17:55 PM IST

 

Vaccination tips: కరోనా వైరస్ మహమ్మారితో సుదీర్ఘ పోరాటం అనంతరం ఇవాళ భారత్ లో కరోనా వ్యాక్సినేషన్  మహా కార్యక్రమం ప్రారంభమైంది. పోరాటం చివరి అంకానికి వచ్చిందనే నమ్మకంతో ఉన్నారు. అయినా..ఏ మాత్రం అజాగ్రత్తగా ఉండవద్దని ఆరోగ్య శాఖ హెచ్చరించింది.

1 /5

పెద్దసంఖ్యలో వ్యాక్సినేషన్ జరిగితేనే హార్డ్ ఇమ్యూనిటీ సాధ్యమవుతుంది. అప్పుడు మీ లైఫ్‌స్టైల్‌ను సాధారణంగా గడపవచ్చు. హార్డ్ ఇమ్యూనిటీ పొందాలంటే..70 శాతం కంటే ఎక్కువమందికి వ్యాక్సినేషన్ అందాల్సి ఉంటుందని ఎయిమ్స్ వైద్యులు సూచించారు. 

2 /5

వ్యాక్సిన్ వేయించుకున్న తరువాత కూడా వైరస్ సోకితే..మీద్వారా ఇతరులకు సంక్రమిస్తుంది. అందుకే మాస్క్ ధరించడం, సామాజిక దూరం పాటించడం ద్వారా వైరస్ సంక్రమించకుండా ఆపవచ్చు. అందుకే వ్యాక్సిన్ తీసుకున్న తరువాత కూడా ఎక్కువ అప్రమత్తంగా ఉండాలి. మీరు తిరిగే గ్రూప్‌లో అందరూ వ్యాక్సినేషన్ వేయించుకుంటే మాత్రం జాగ్రత్తలు తీసుకోవల్సిన అవసరం లేదు.

3 /5

ఒకవేళ రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తయితే..వైరస్ సంక్రమణ భయం చాలావరకూ తగ్గుతుందని నిపుణులు అంటున్నారు. వ్యాక్సినేషన్ కారణంగా గతంలో కంటే మీరు కాస్త సురక్షితం అని మాత్రం చెప్పవచ్చు. మాస్క్ ధరించడం, సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం చేస్తే తప్పకుండా రక్షణ లభిస్తుంది. 

4 /5

ప్రపంచ ఆరోగ్య సంస్థ జారీ చేసిన కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా వ్యాక్సినేషన్ పూర్తిగా రక్షితం కాదు. ఈ నేపధ్యంలో భారీగా వ్యాక్సినేషన్ జరిగేంతవరకూ కరోనా గైడ్‌లైన్స్ పాటించాలి.

5 /5

వ్యాక్సిన్ ఒకసారి తీసుకుంటే మళ్లీ ఎప్పుడూ వైరస్ సోకదని గ్యారంటీ లేదని శాస్త్రవేత్తలు తెలిపారు. అజాగ్రత్తగా ఉన్నా..సంక్రమిత రోగులతో టచ్‌లో ఉన్నా..వ్యాక్సినేషన్ వేయించుకున్నాక కూడా ప్రమాదముంది. ఈ నేపధ్యంలో వ్యాక్సినేషన్ తరువాత కూడా మాస్క్ ధరించడం వంటివి చేయక తప్పదు.