Skin Care: చేతిపై ముడతలతో సమస్యగా ఉందా ? ఇలా చేస్తే వెంటనే ఫలితాలు
Skin Care: మృదువుగా ఉండే అరచేతుల్ని ఎప్పటికప్పుడు సంరక్షించుకోవడం చాలా అవసరం. నిత్యం చేసే పనుల కారణంగా అరచేతి చర్మం ముడతలతో..నిర్జీవంగా మారుతుంటుంది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం.
Skin Care: మృదువుగా ఉండే అరచేతుల్ని ఎప్పటికప్పుడు సంరక్షించుకోవడం చాలా అవసరం. నిత్యం చేసే పనుల కారణంగా అరచేతి చర్మం ముడతలతో..నిర్జీవంగా మారుతుంటుంది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం.
ముఖ సౌందర్యం కోసం ఎంతటి ప్రాధాన్యత ఇస్తామో అరచేతులకు కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే శరీరంలో అతి ముఖ్యమైన భాగమిది. నిత్యం చేసే పనుల కారణంగా అరచేతి చర్మం ముడతలతో నిర్జీవంగా మారుతుంటుంది. సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లనే ఇలా జరుగుతుంది. ఫలితంగా అరచేతులు అందం కోల్పోతాయి. అందుకే చేతిపై ఎప్పుడైనా ముడతలు కన్పిస్తే నిర్లక్ష్యం వహించకూడదు. మరింత ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే మహిళలకు ఇది కష్టమైన పనే. ఎందుకంటే ఇంటి పనుల వల్ల చేతులు పాడవుతుంటాయి. అందుకే చేతుల గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఎండిపోయిన, నిర్జీవమైన చేతుల గురించి ఎలాంటి సంరక్షణ చర్యలు తీసుకోవాలో చూద్దాం..
అలోవెరా జెల్ అనేది సహజసిద్దమైన మాయిశ్చరైజర్. చేతుల సంరక్షణకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే గుణాలు చాలా ప్రయోజనకరం. అలోవెరా జెల్‌లో టీట్రీ ఆయిల్, రోజ్ వాటర్ కలిపి పేస్ట్‌గా చేసుకోవాలి. చేతిలో కాస్త తీసుకుని మస్సాజ్ చేయాలి. సరైన పద్ధతిలో ఉపయోగించడం వల్ల లాభాలుంటాయి.
అల్యూమ్ నీళ్లు కూడా చేతుల సంరక్షణకు ఉపయోగపడతాయి. చేతిలో ముడతలు తొలగించేందుకు చాలా ప్రయోజనకకరం. ఇది చర్మాన్ని డీటైన్ చేసే స్వభావాన్ని కలిగి ఉంటుంది. ముందుగా నీటిలో అల్యూమ్ కాస్త కలిపి అందులో నిమ్మరసం వేయాలి. ఆ మిశ్రమంలో మీ చేతుల్ని పది నిమిషాలు ముంచాలి. తరువాత చేతులు తీసేసి..శుభ్రంగా తుడిచి క్రీమ్ రాయాలి. రాత్రి పడుకునేముందు ఇలా చేయడం వల్ల లాభాలుంటాయి.
కొబ్బరినూనెలో చాలా గుణాలుంటాయి. చేతుల సంరక్షణకు కొబ్బరినూనె బాగా ఉపయోగపడుతుంది. కొబ్బరినూనెలో విటమన్ ఇ ఆయిల్ కలిపి..పేస్ట్‌గా చేసుకుని..దాంతో మస్సాజ్ చేసుకోవాలి. 5 నిమిషాల తరువాత చేతుల్ని కడిగి మాయిశ్చరైజర్ రాసుకుంటే మంచి ఫలితాలుంటాయి.
Also read: Health Tips: ప్రతిరోజూ ఓట్స్ అల్పాహారమా...మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి