Green Mango Benefits: వేసవి వచ్చిందంటే ప్రధానంగా కన్పించేది మామిడి పండ్లే. మామిడికి పండ్లలో రారాజుగా పేరుంది. ఇది సమ్మర్ స్పెషల్. మామిడి పండ్లతో రోగ నిరోధక శక్తి పెరుగుతుందని చాలామందికి తెలియదు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మామిడిపండ్లలో ఉండే అద్భుతమైన పోషక పదార్ధాలు, విటమిన్స్, ఖనిజాల కారణంగా ఆరోగ్యపరంగా చాలా ప్రయోజనాలుంటాయి. అందుకే సమ్మర్ స్పెషల్ మామిడిని సూపర్ ఫ్రూట్‌గా పిలుస్తారు. భారతదేశంలోని పలు ప్రాంతాల్లో మామిడి పంట విస్తారంగా ఉంటుంది. అదే సమయంలో దేశంలో దొరికే మామిడి రకాలు మరెక్కడా లభించవు. ఆరోగ్యపరంగా పలు ప్రయోజనాలు కలిగిన మామిడితో స్థూలకాయం నియంత్రణ, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ కేన్సర్, హార్మోన్ల విడుదల సక్రమంగా ఉండేందుకు ఉపయోగపడుతుందని ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పచ్చి మామిడితో.


పచ్చి మామిడి కారణంగా శరీరంలో సోడియం, మినరల్స్ అసమతుల్యతను దూరం చేయవచ్చంటున్నారు వైద్య నిపుణులు. ఇందులో పుష్కలంగా లభించే ఐరన్, సోడియం క్లోరైడ్ శరీరానికి చాలా అవసరం. మామిడిలో సమృద్ధిగా ఉండే విటమిన్ సి..స్కర్వీ వ్యాధి చికిత్సలో దోహదపడుతుంది. అంతేకాదు రోగ నిరోధక శక్తి పెంచుతుంది. పచ్చిమామిడిలో విటిమిన్ సితో పాటు విటమిన్ ఎ కూడా ఎక్కువే ఉంటుంది. ఇది కంటి దృష్టిని మెరుగుపరుస్తుంది. చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా..ప్రోస్టేట్ కేన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. పచ్చి మామిడి తినడం వల్ల బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్ల నుంచి ప్రేగుల్ని కాపాడి..క్లీన్ చేస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. 


పచ్చి మామిడి సీజన్‌లో క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కొత్త రక్తకణాలు ఉత్పత్తి అవుతాయి. నోటి చిగుళ్ల ఇన్‌ఫెక్షన్స్, రక్తం కారడం, పన్ను నొప్పి సమస్యలు దూరమౌతాయి. పచ్చి మామిడి ముక్కలు నమిలి తినడం వల్ల నోటిలో బ్యాక్టీరియా, క్రిములు నశిస్తాయి. నోటి దుర్వాసన దూరమౌతుంది. ఇక మరీ ముఖ్యంగా అజీర్ణం, మలబద్ధకం నియంత్రణలో దోహదపడుతుంది. మామిడి పండ్లతో శరీరానికి ఎనర్జీ లభిస్తుంది. వేసవిలో సహజంగా ఎదురయ్యే అలసట దూరమౌతుంది. 


Also read: Coconut Health Benefits: కొబ్బరినీళ్లతో కలిగే అద్బుత ప్రయోజనాలు, బరువు తగ్గేందుకు కూడా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook