/telugu/photo-gallery/hero-sai-durga-tej-emotional-with-his-mama-pawan-kalyan-pics-goes-viral-rv-180879 Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు 180879

Coconut Health Benefits: వేసవి ఎండలు దంచి కొడుతున్నాయి. వేసవి తాపం తీర్చుకునేందుకు చల్లని పానీయాల్ని ఆశ్రయిస్తున్నారు. వేసవిలో కొబ్బరి నీళ్లు ఒక్కటే మంచి ప్రత్యామ్నాయమంటున్నారు వైద్య నిపుణులు. కొబ్బరినీళ్లతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.

వేసవిలా సాధారణంగా చల్లదనం కోసం లేదా దాహం తీర్చుకునేందుకు వివిధ రకాల కూల్‌డ్రింక్స్ తీసుకుంటుంటాం. కానీ కూల్‌డ్రింక్స్ అనేది ఆరోగ్యానికి ఏ మాత్రం మంచివి కావు. శరీరంలో అంతర్గతంగా ఉండే వేడిని చల్లార్చుకోవడమే కాకుండా..బాడీ ఎప్పుడూ హైడ్రేట్‌గా ఉంచడం చాలా ఉత్తమం. లేకపోతే వడదెబ్బ తగిలే ప్రమాదముంది. అందుకే వేసవిలో సాధ్యమైనంతవరకూ కూల్‌డ్రింక్స్ పూర్తిగా మానేయాల్సి ఉంటుంది. మరి వేసవిలో ఎటువంటి ద్రవపదార్ధాలు తీసుకోవడం మంచిదనే ప్రశ్న తలెత్తుతుంది. దీనికి సమాధానమే కొబ్బరినీళ్లు. వేసవిలో కొబ్బరి నీళ్లతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం..

వేసవిలో ఎప్పుడూ ప్రకృతి సిద్ధంగా లభించే పండ్లు, కొబ్బరి నీళ్లు తీసుకోవడమే అత్యుత్తమ మార్గం. చల్లగా తాగాలన్పించినా సరే ఖర్బూజ, తర్బూజ, కొబ్బరి నీళ్లనే అలవాటు చేసుకోవాలి. వీటివల్ల శరీరం డీ హైడ్రేట్ కాకుండా ఉంటుంది. కొబ్బరినీటిలో సహజ సిద్ధమైన విటమిన్స్, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. వేసవిలో ఎదురయ్యే వడదెబ్బ నుంచి కాపాడుకోవాలంటే..కొబ్బరినీళ్లను క్రమం తప్పకుండా తీసుకోవాలంటున్నారు వైద్య నిపుణులు. కొబ్బరి నీళ్లతో కడుపులో మంట, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు దూరమౌతాయి. కొబ్బరినీటిలో ఉండే పొటాషియం, సోడియం అల్కలైన్ కారణంగా రక్తపోటు తగ్గతుంది. కొబ్బరినీళ్లు..సహజమైన ఎలక్ట్రోలైట్‌గా ..రిఫ్రెష్‌గా..హైడ్రేడెట్‌గా ఉంచుతాయి. 

కొబ్బరి నీళ్లలో ఉండే పోషక పదార్ధాలు

కొబ్బరినీళ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఎసిటమైనోపెన్ కారణంగా కాలేయం మెరుగ్గా ఉంటుంది. డయాబెటిస్ వ్యాధిగ్రస్థులు మాత్రం తక్కువ మోతాదులో తీసుకోవాలి. కొబ్బరినీళ్లతో ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. ఏ రకమైన ఇన్‌ఫెక్షన్స్ దరిచేరవు. కొబ్బరినీళ్లలో ఉండే కాల్షియం కారణంగా ఎముకలు, దంతాలు ధృడంగా ఉంటాయి. కొబ్బరి నీళ్లనేవి కేవలం వేసవిలో హైడ్రేట్‌గా ఉంచడమే కాదు..బరువు తగ్గేందుకు కూడా దోహదపడుతాయి. ఓ కప్పు కొబ్బరినీళ్లలో విటమిన్ సి, ఫైబర్, మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం, మాంగనీస్, సోడియం వంటి మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. 

కొబ్బరి నీళ్లను క్రమం తప్పకుండా తీసుకుంటే వృద్ధాప్య ఛాయలు తగ్గుతాయి. వ్యాయామం తరువాత పండ్ల రసాలు తీసుకోవడం కంటే..కొబ్బరినీళ్లు తీసుకోవడం అత్యుత్తమం. కొబ్బరిలో 95 శాతం నీరుండటం వల్ల నీటి కొరత తలెత్తదు. వివిధ రకాల వ్యాధులతో బాధపడేవారు, తరచూ వైరల్ ఇన్‌ఫెక్షన్స్‌కు గురయ్యేవారు కొబ్బరినీళ్లను తీసుకుంటే మంచి ప్రయోజనాలుంటాయి.

Also read: Lungs Cancer Symptoms: ఊపిరితిత్తుల కేన్సర్ ఎలా గుర్తించాలి, ఆ లక్షణాలెలా ఉంటాయి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Section: 
English Title: 
Coconut Health benefits, hydrate your body in summer and check the obesity problem
News Source: 
Home Title: 

Coconut Health Benefits: కొబ్బరినీళ్లతో కలిగే అద్బుత ప్రయోజనాలు, బరువు తగ్గేందుకు

 Coconut Health Benefits: కొబ్బరినీళ్లతో కలిగే అద్బుత ప్రయోజనాలు, బరువు తగ్గేందుకు కూడా
Caption: 
Coconut water benefits ( file photo)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
Coconut Health Benefits: కొబ్బరినీళ్లతో కలిగే అద్బుత ప్రయోజనాలు, బరువు తగ్గేందుకు
Md. Abdul Rehaman
Publish Later: 
No
Publish At: 
Sunday, March 20, 2022 - 11:04
Created By: 
Md. Abdul Rehaman
Updated By: 
Md. Abdul Rehaman
Published By: 
Md. Abdul Rehaman
Request Count: 
35
Is Breaking News: 
No