Soaked Peanuts Health Benefits: రోగం లేని జీవితానికి రోజూ నానబెట్టిన వేరుశనగ చాలు!
Health Benefits Soaked Peanuts: వేరుశనగను పోషకాలగనిగా చెప్పవచ్చు. పోషకాలు పుష్కలంగా ఉన్నందున దీనిని పేదల బాదం అంటారు. వేరుశెనగలో విటమిన్ బి, ఇ, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, ప్రోటీన్, మెగ్నీషియం, ఫాస్పరస్ ,పొటాషియం వంటి వివిధ పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.
Health Benefits Soaked Peanuts: వేరుశనగను పోషకాలగనిగా చెప్పవచ్చు. పోషకాలు పుష్కలంగా ఉన్నందున దీనిని పేదల బాదం అంటారు. వేరుశెనగలో విటమిన్ బి, ఇ, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, ప్రోటీన్, మెగ్నీషియం, ఫాస్పరస్ ,పొటాషియం వంటి వివిధ పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. వేరుశనగను వివిధ రకాలుగా ఆహారంలో చేర్చుకోవచ్చు. వేయించిన వేరుశనగను ఇష్టపడని వారు ఎవరైనా ఉండగలరా? అదేవిధంగా ఉడకబెట్టిన వేరుశనగను చాలా మంది ఇష్టపడతారు. అయితే నానబెట్టిన వేరుశెనగను తింటే లెక్కలేనన్ని ప్రయోజనాలు ఉంటాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. బరువు తగ్గించి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
వేరుశనగ పొట్టులో ఫైటేట్, ఆక్సలేట్ వంటి సమ్మేళనాలు ఉంటాయి. ఇవి శరీరం పోషకాలను పూర్తిగా గ్రహించకుండా అడ్డుకుంటాయి. కాబట్టి వేరుశనగను నానబెట్టినప్పుడు ఫైటేటింగ్ ప్రభావం తగ్గుతుంది. సాధారణంగా గింజలను నానబెట్టడం వల్ల వాటిని పచ్చిగా తినడం కంటే వాటి పోషకాలను పూర్తిగా గ్రహించేందుకు సహాయపడుతుందని పోషకాహార నిపుణులు నొక్కి చెబుతూనే ఉన్నారు.
ఇదీ చదవండి: కింగ్ చార్లెస్ III మాత్రమే కాదు.. ఈ బ్రిటిష్ రాజకుటుంబసభ్యులు కూడా కేన్సర్‌తో బాధపడ్డారు..
ఊబకాయం..
వేరుశెనగలో కేలరీలు అధికంగా ఉన్నప్పటికీ, జీవక్రియను పెంచడం ద్వారా స్థూలకాయాన్ని తగ్గించడంలో వేరుశెనగ సహాయపడుతుంది. కొవ్వును కాల్చడానికి మంచి జీవక్రియ రేటును కలిగి ఉండటం చాలా ముఖ్యం. కాబట్టి రోజూ నానబెట్టిన వేరుశెనగలను మీ ఆహారంలో చేర్చుకోండి.
గుండె ఆరోగ్యం..
నానబెట్టిన వేరుశెనగ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. రక్త ప్రసరణను పెంచడం వల్ల వేరుశనగ రక్తాన్ని శుద్ధి చేస్తుంది, కొవ్వును కాల్చివేస్తుంది. తద్వారా ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అలాగే వేరుశనగ శరీరానికి వేడిని అందించి, కొవ్వును కరిగించి, కొలెస్ట్రాల్ ను నియంత్రిస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ను బర్న్ చేస్తాయి.
ఇదీ చదవండి: అరచేతులు దురద పెడితే ఆర్థికలాభం కాదు.. ఈ అనారోగ్య సమస్యలట..
జీర్ణశక్తి..
వేరుశనగలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఉదయాన్నే నానబెట్టిన వేరుశనగను ఒక గుప్పెడు తింటే పొట్ట శుభ్రపడుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, గ్యాస్ నుండి ఉపశమనం పొందుతుంది. జీర్ణశక్తి బాగుంటే రకరకాల వ్యాధులకు టాటా బై బై చెప్పొచ్చు.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter