Roya Family Diagnosed with Cancer: కింగ్ చార్లెస్ III మాత్రమే కాదు.. ఈ బ్రిటిష్ రాజకుటుంబసభ్యులు కూడా కేన్సర్‌తో బాధపడ్డారు..

Roya Family Diagnosed with Cancer: క్యాన్సర్ వ్యాధి బ్రిటిష్ రాజ కుటుంబాన్ని కూడా ఇబ్బంది పెడుతోంది. తాజాగా ప్రస్తుత రాజు చార్లెస్ III కూడా ఈ వ్యాధితోనే బాధపడుతున్నారు.ప్రోస్టేట్ చికిత్స కోసం లండన్ క్లినిక్‌లో చేరిన వారం తర్వాత కింగ్ చార్లెస్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారని బకింగ్‌హామ్ ప్యాలెస్ తెలియజేసింది. 

1 /7

King charles III.. కింగ్ చార్లెస్ III పూర్తి పేరు చార్లెస్ ఫిలిప్ ఆర్థర్ జార్జ్. ఈమర 1948 నవంబర్ 14న జన్మించాడు. అతను తన తల్లి క్వీన్ ఎలిజబెత్ II మరణం తర్వాత 8 సెప్టెంబర్ 2022న బ్రిటన్‌కు రాజయ్యాడు. ఫిబ్రవరి 2024 ఓ నివేదిక అతనికి క్యాన్సర్‌ ఉన్నట్లు వెల్లడించింది.

2 /7

ఎలిజబెత్ బోజ్ లియాన్.. ఎలిజబెత్ బోవెస్-లియాన్, క్వీన్ మదర్ అని కూడా పిలుస్తారు. క్వీన్ ఎలిజబెత్ II తల్లి. ఆమె తన 101 సంవత్సరాల వయస్సులో 2002 లో కేన్సర్ తో మరణించారు.

3 /7

కింగ్ ఎడ్వర్డ్ VII.. కింగ్ ఎడ్వర్డ్ VII పాలన 1901 -1910 వరకు ఉంది. అతను రోడెంట్ అల్సర్‌తో బాధపడ్డాడు.

4 /7

కింగ్ ఎడ్వర్డ్ VIII .. ది డ్యూక్ ఆఫ్ విండ్సర్ అని కూడా పిలువబడే కింగ్ ఎడ్వర్డ్ VIII 1971లో గొంతు క్యాన్సర్‌తో బాధపడ్డాడు.

5 /7

కింగ్ జార్జ్ VI.. కింగ్ జార్జ్ VI పదవీకాలం 1936 -1952 మధ్య ఉంది. ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ అధ్యయనం ప్రకారం జార్జ్ ఎక్కువగా చైన్ స్మోకర్‌. దాని వల్ల అతనికి ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చింది. 

6 /7

క్వీన్ విక్టోరియా.. క్వీన్ విక్టోరియా.. ప్రిన్స్ ఆల్బర్ట్ కుమార్తె ప్రిన్సెస్ విక్టోరియా. 1898 సంవత్సరంలో రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు నిర్ధారణ అయింది, ఆ తర్వాత ఆమె చాలా కాలం పాటు మంచాన పడింది. తర్వాత క్యాన్సర్ ఆమె వెన్నెముకకు వ్యాపించిం 60 సంవత్సరాల వయస్సులో 1901 ఆగస్టు 5న మరణించింది.

7 /7

సారా ఫెర్గూసన్.. ది డచెస్ ఆఫ్ యార్క్ అని కూడా పిలువబడే సారా ఫెర్గూసన్, జూన్ 2023లో తనకు రొమ్ము క్యాన్సర్ ఉందని, ఆ తర్వాత ఆమెకు ఒకే మాస్టెక్టమీ జరిగిందని వెల్లడించింది. ఆ తర్వాత జనవరి 2024లో అతనికి మాలిగ్నెంట్ మెలనోమా అనే మరో రకం క్యాన్సర్ ఉన్నట్లు గుర్తించారు.