Itching Palms: అరచేతులు దురద వచ్చినప్పుడు డబ్బులు వస్తాయి అంటారు. కానీ, ఇలా జరిగితే వెంటనే వైద్యులను సంప్రదించాలి. దానికి అసలు కారణం ఏంటో తెలుసుకుందాం.
అరచేతులు, పాదాలు దురద..
అరచేతలు, పాదాలు దురద పెడితే మీరు చర్మ సంబంధిత వ్యాధులతో బాధపడున్నారని అర్థమట. ఇవి తీవ్రమైన వ్యాధిగా కూడా మారే అవకాశం ఉందట. వైద్యులను సంప్రదించడం మేలు.
సోరియాసిస్..
సోరియాసిస్ కూడా స్కిన్ అలెర్జీ. చర్మంపై తెల్లని పొలుసులు వంటి ఏర్పడి బాధకరంగా ఉంటుంది. సోరియాసిస్ వల్ల కూడా దురద ఎక్కువగా ఉంటుంది.
డ్రై స్కిన్..
అరతేతులు దురద, మంట డ్రై స్కిన్ సమస్యల వల్ల కూడా కలుగుతుంది. ఈ డ్రై స్కిన్ సమస్య కూడా తీవ్రంగా దురద, మంట వస్తుంది.
అలెర్జీ..
ఏదైనా వస్తువులు, పదార్థాలను తాకితే అలెర్జీ రావచ్చు. ఈ దురద వెంటనే తగ్గుదు. దాన్ని మీరు గమనించాలి. దురద తగ్గడానికి చాలా సమయం పట్టవచ్చు. కొందరికి దుస్తులు వేసుకుంటే కూడా దురద వస్తుంది.
తామర..
ఎర్ర మచ్చలతో దురద కలుగుతుంది. ప్రభావిత ప్రాంతంలో పాచెస్‌కు కారణమవుతుంది. చర్మం పొడిగా మారి తామర వస్తుంది.
మధుమేహం..
చేతులు, కాళ్లు దురదగా ఉండటం కూడా మధుమేహం లక్షణాలు కావచ్చట. మధమేహంతో బాధపడేవారు చాలామంది పాదాల్లో దురదను అనుభవిస్తారు.
చికిత్స ఎలా చేయాలి?
స్నానం చేసిన ప్రతిసారి మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ముఖ్యంగా మాయిశ్చరైజర్లో గ్లిజరిన్ ఉండేలా చూసుకోవాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter