Summer Healthy Fruits: ఎండలు భగభగ మండిపోతున్నాయి. ఏకాస్త బయటకు వెళ్లినా విపరీతమై చెమటలు, దాహం వేస్తోంది. ఇక మన జీవనశైలిలో కూడా కొన్ని మార్పుల చేసుకోవడం మంచిది. ముఖ్యంగా ఎండకాలం నీరు శాతం అధికంగా ఉండే పండ్లను తీసుకోవాలి. మండే ఎండలో 5 పనులు తింటే రోజంతా తగిన శక్తి లభిస్తుంది.అంతేకాదు ఈరోజుల్లో యాసిడిటీ సమస్యతో చాలామంది బాధపడుతున్నారు. ఇది నివారించడానికి ఆహారంలో మార్పులు చేసుకోవాలి. ఈరోజు ఎండకాలం హాయిగా తినాల్సిన పండ్లు ఇవి కడుపు సంబంధిత సమస్యలకు కూడా చెక్ పెట్టే ఫ్రూట్స్ గురించి తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మొదటగా పుచ్చకాయ ఎండాకాలం వచ్చిందంటే చాలు మార్కెట్లో విపరీతంగా కనిపిస్తుంది ఇందులో నీటి శాతం అధికంగా ఉంటుంది. పుచ్చకాయను డైట్లో చేర్చుకోవడం వల్ల యాసిటిటీ సమస్య నుంచి బయటపడవచ్చు. ఈ పండు తీసుకోవడం వల్ల డిహైడ్రేషన్ కి గురికారు ఎండాకాలం ఈ పండు తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది కూడా నిర్వహిస్తుంది
పుచ్చకాయ మాత్రమే కాదు బొప్పాయి, యాపిల్లో కూడా మంచి పోషకాలు ఉంటాయి. ఇవి కూడా కడుపు సంబంధిత సమస్యలు రాకుండా కాపాడతాయి.


ఇదీ చదవండి: ఆరోగ్యాన్నిచ్చే అక్రోట్లు.. డైలీ ఇలా తింటే మీ శరీరంలో బిగ్ మిరాకిల్..


వేసవిలో తప్పకుండా తీసుకోవాల్సిన మరో డ్రింక్ కొబ్బరి బొండం ఇందులో ప్రకృతి సహజ సిద్ధమైన గుణాలు కలిగి ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల కడుపు శుభ్రం అవుతుంది
కొబ్బరి నీళ్లలో పీచు పదార్థం సమృద్ధిగా ఉండటం వల్ల కడుపులో నుంచి విషపదార్థాలు సులభంగా బయటికి తరిమేస్తుంది. కొబ్బరి బొండం తీసుకోవడం వల్ల డిహైడ్రేషన్ కి గురికాకుండా ఉంటారు. వడదెబ్బ సమస్య నుంచి కూడా సులభంగా బయటపడవచ్చు.అందుకే ఎండాకాలం కొబ్బరి నీరు కచ్చితంగా తాగాల్సి ఉంటుంది.


ఇదీ చదవండి: రాగిరొట్టె డయాబెటిక్ రోగులకు దివ్యౌషధం.. రక్తంలో చక్కెర స్థాయిలను పెరగనివ్వదు...


ఇక చల్లటి పాలను తీసుకోవడం వల్ల కూడా యాసిటిటీ సమస్య దరిచేరదు. యాసిడిటీ సమస్యతో బాధపడేవారు చక్కెర లేకుండా చల్లటి పాలను తాగాలి పాలు కడుపులోని యాసిడ్ని పీల్చేస్తుంది. ఇక మనకు మార్కెట్లో సులభంగా దొరికే మరోపండు అరటిపండు ఇది కూడా యాసిడిటీ సమస్యకు మంచి మందు. ఇందులోని పొటాషియం కడుపు సంబంధించిన వ్యాధులకు దరిచేరనీవు. ఈ పండులో కూడా ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది వేసవికాలంలో అరటిపండు బాగా పండినవి తీసుకుంటే యాసిడిటీ సమస్యలు రావు(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter