Mucus Over Production Foods: మ్యూకస్ లేదా శ్లేష్మం అనేది శరీరంలో ఉత్పత్తి చెందే జారుడు స్వభావం గల పదార్థం. మ్యూకస్ శ్వాస వ్యవస్థలో ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేచించబడే గాలిలో ఉండే చిన్న చిన్న కణాలను, ధూళి మరియు బ్యాక్టీరియా వంటి వాటిని శరీరంలో ప్రశించకుండా ఆపుతుంది. జీర్ణవ్యవస్థలో, లోపలి గోడలపై ఒక పొరలా ఏర్పడే ఈ పదార్థం.. ఆసిడ్ లేదా ఆమ్ల ద్రావణాల నుండి జీర్ణవ్యవస్థ గోడలు ప్రమాదానికి గురవకుండా కాపాడుతుంది. అంతేకాకుండా, మ్యూకస్ కణాలు పొడి భారకుండా చూస్తుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ముక్కు మరియు గొంతు భాగాలలో ఉండే శ్లేష్మం సాధారణ స్థాయిలో ఉంటే ఎలాంటి నష్టం లేదు. కానీ, అధిక మొత్తంలో శ్లేష్మ ఉత్పత్తి వలన శ్వాస తీసుకోటానికి సమస్యలు కలగవచ్చు. ముఖ్యంగా జలుబు కలిగే అవకాశాలు ఎక్కువ. కొన్ని రకాల ఆహార పదార్థాలు జీర్ణ వ్యవస్థలోని చిన్న పేగులో శ్లేష్మ ఉత్పత్తిని అధికం చేస్తాయి. శ్లేష్మాన్ని ఉత్పత్తి చేసే ఆహార పదార్థాల గురించి తెలుసుకొని, వాటిని తక్కువగా తినటం వలన శ్వాస సంబంధిత సమస్యలకు దూరంగా ఉండవచ్చు.


పాలు & పాల ఉత్పత్తులు   
పెరుగు, చీస్, క్రీమ్, కాటేజ్ చీస్, బటర్ వంటి పాల ఉత్పత్తులు మరియు పాల వంటి పదార్థాలు గొంతు భాగంలో శ్లేష్మ ఉత్పత్తిని అధికం చేస్తాయి. వీటిలో ఉండే కెసిన్ అనే ప్రోటీన్ అణువులు శ్లేష్మ ఉత్పత్తిని అధికం చేస్తాయి. మన శరీరంలో కెసిన్ జీర్ణం అవటం చాలా నెమ్మదిగా లేదా కష్టమవ్వచ్చు. ఫలితంగా, సైనస్ ఇన్ఫెక్షన్ లు కలిగే అవకాశం కూడా లేకపోలేదు. అంతేకాకుండా ఇతర పాల ఉత్పత్తులు కూడా లాక్టోజ్ అనబడే చక్కెరలను కలిగి ఉండి, మ్యూకస్ ను ఉత్పత్తి చేస్తాయి.


బ్రేడ్ & పాస్తా
గోధుమతో తయారైన ప్రతి ఆహార పదార్థం శరీరంలో అనారోగ్యకర శ్లేష్మాన్ని చేస్తాయి. బ్రెడ్, పాస్తా మరియు సంవిధాన పరచిన తృణధాన్యాలు, నట్స్ మరియు లేగ్యూమ్స్ వంటివి మ్యూకస్ ను ఉత్పత్తి చేస్తాయి. నిజానికి వండిన తృణ ధాన్యాలు కూడా మ్యూకస్ ఉత్పత్తిని అధికం చేస్తాయి. 


మాంసాలు మరియు నూనెలు
ఫ్లూ జ్వరం కలిగి ఉన్న మాంసం, చేపలు, గుడ్లు మరియు చికెన్ వంటి వాటికి దూరంగా ఉండటం చాలా మంచిది. ఎందుకంటే ఇవి కూడా పాల ఉత్పత్తుల వలే మ్యూకస్ ను ఉత్పత్తి చేస్తాయి. అంతేకాకుండా, నూనెలో ఎక్కువగా వేయించిన ఆహార పదార్థాలు కూడా మ్యూకస్ ను ఉత్పత్తి చేస్తాయి. 


ద్రావణాలు మరియు ఉప్పు
కాఫీ (కెఫీన్), బ్లాక్ టీ, ఆల్కహాల్ మరియు సాఫ్ట్ డ్రింక్స్ వంటి ద్రావణాలు మ్యూకస్ ఉత్పత్తిని అధికం చేస్తాయి. బ్లాక్ టీ లో అధిక మొత్తంలో కెఫీన్ ను కలిగి ఉండి, శ్లేష్మ తయారీని అధికం చేస్తుంది. సంవిధాన పరచిన ఆహార పదార్థాలలో అధిక మొత్తంలో ఉప్పు మరియు చక్కెరలను కలిగి ఉండి శరీరంలో అధిక మొత్తంలో మ్యూకస్ ను ఉత్పత్తి చేస్తాయి. 


మాంసాలు & ఆయిల్ 
జలుబు, జ్వరంతో భాధపడేవారు చేపలు, గుడ్లు, మటన్ మరియు చికెన్ వంటి వాటికి దూరంగా ఉండటం చాలా మంచిది. ఎందుకంటే ఇవి కూడా పాల ఉత్పత్తుల వలే మ్యూకస్ ను ఉత్పత్తి చేస్తాయి. అంతేకాకుండా, నూనెలో ఎక్కువగా వేయించిన ఆహార పదార్థాలు కూడా మ్యూకస్ ను ఉత్పత్తి చేస్తాయి. 


కాఫీ, ఆల్కహాల్ & సాఫ్ట్ డ్రింక్స్ 
కాఫీ (కెఫీన్), బ్లాక్ టీ, ఆల్కహాల్ మరియు సాఫ్ట్ డ్రింక్స్ వంటి ద్రావణాలు మ్యూకస్ ఉత్పత్తిని అధికం చేస్తాయి. బ్లాక్ టీ లో అధిక మొత్తంలో కెఫీన్ ను కలిగి ఉండి, శ్లేష్మ తయారీని అధికం చేస్తుంది. సంవిధాన పరచిన ఆహార పదార్థాలలో అధిక మొత్తంలో ఉప్పు మరియు చక్కెరలను కలిగి ఉండి శరీరంలో అధిక మొత్తంలో మ్యూకస్ ను ఉత్పత్తి చేస్తాయి. 


Also Read: IND vs SL Playing XI: గిల్, శ్రేయస్‌లకు చోటు.. తెలుగు ఆటగాడికి నిరాశే! శ్రీలంకతో బరిలోకి దిగే భారత జట్టు ఇదే!!


Also Read: Ajith New Look: స్టైలిష్‌ లుక్‌లో అజిత్‌.. ఆ సినిమా కోసమేనా?!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook