Tulsi Herbal Tea For Diabetes: మధుమేహంతో బాధపడుతున్నవారు తప్పకుండా ఆహారాలపై శ్రద్ధ వహించాలని నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఆహార నియమాలు కూడా పాటించాల్సి ఉంటుంది. వీటి కోసం హెర్బల్ టీలను తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వీటి వల్ల శరీరంలోని రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది. కావున మధుమేహంతో బాధపడుతున్నవారు తప్పకుండా ఈ టీని తీసుకోవాలి. ఇందులో ఉండే మూలకాలు దగ్గు, జలుబు, జ్వరాన్ని నయం చేయడానికి సహాయపడతాయి. ఈ టీలో చాలా రకాల  ఔషధ గుణాలు ఉంటాయి. కావున మధుమేహం బారిన పడకుండా చేస్తాయి. ముఖ్యంగా రోగనిరోధక శక్తి, జీర్ణక్రియ వంటి సమస్యలతో బాధపడుతున్న వారికి ఇది మంచి  ఔషధంగా పని చేస్తుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తులసి హెర్బల్ టీ వల్ల ప్రయోజనాలు:


తులసిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి.  ఇది స్థూలకాయం, మధుమేహం వంటి సమస్యలను కూడా దూరం చేస్తుంది. రక్తంలో చక్కెర పరిమాణాలను తగ్గించడానికి ప్రధాన పాత్ర పోషిస్తుంది. తులసిలో యాంటి డయాబెటిస్‌ లక్షణాలున్నాయి. కావున మధుమేహాన్ని నియంత్రించడానికి ప్రధాన పాత్ర పోషిస్తుంది.


తులసి హెర్బల్ టీని ఎలా తయారు చేయాలి?:


    >>ఒక కప్పు నీళ్లు తీసుకుని బౌల్‌లో వేయాలి.
    >> అందులో 2 నుంచి 3 తులసి ఆకులను వేయాలి.
    >>ఈ నీటిలో ఆకులను మరిగించాలి.
    >>ఇప్పుడు ఆకులు 4-5 నిమిషాలు నీటిలో ఉడకనివాలి.
    >>సిద్ధం చేసిన టీని కప్పులో తీసుకుని.. రుచి కోసం ఒక టీస్పూన్ తేనెను కూడా వేసుకోవాలి.
    
ఈ టీలో అల్లం, దాల్చినచెక్కను కూడా వేయాలి. డయాబెటిస్‌తో బాధపడుతున్న వారు ఈ టీని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మధుమేహం సులభంగా కంట్రోల్‌ ఉంటుంది. కావున ఈ సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా ఖాళీకడుపుతో ఈ టీని తీసుకోవాలి.


(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)


Also read:  Diabetes Control Tips: ఆయుర్వేద చిట్కాలతో ఇలా మధుమేహానికి సులభంగా చెక్‌ పెట్టొచ్చు..


Also read: Weight Loss Diet: బరువు తగ్గాలనుకుంటున్నారా.. రోజూ డైట్‌లో ఈ సలాడ్స్‌ను తీసుకోండి..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook