యూరిక్ యాసిడ్ సమస్య ఎంత సులభంగా కన్పిస్తుందో అంత సీరియస్ విషయమిది. జాగ్రత్తగా ఉంటే నియంత్రణ సాధమైనట్టే..నిర్లక్ష్యం వహిస్తే ప్రాణాంతకం కావచ్చు. యూరిక్ యాసిడ్ లక్షణాలు ఎలా ఉంటాయి, ఎందుకీ సమస్య తలెత్తుతుందో పరిశీలిద్దాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

యూరిక్ యాసిడ్ కారణంగా కిడ్నీ సమస్య, యూరిన్ సమస్యలు తలెత్తుతాయి. యూరిక్ యాసిడ్ సమస్య ఉంటే..యూరిన్ సంబంధిత సమస్యలతో పాటు కిడ్నీలో రాళ్ల లక్షణాలు కూడా బయటపడతాయి.


1. జాయింట్ పెయిన్స్ లేదా స్వెల్లింగ్ కూడా ఓ లక్షణంగా ఉంది. ఒకవేళ మీ శరీరపు జాయింట్స్‌లో నొప్పి ఉంటే యూరిక్ యాసిడ్ లక్షణం కావచ్చు. యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ జాయింట్లలో చేరడం వల్ల నొప్పి వస్తుంది


2. వేళ్లు వాచడం కూడా యూరిక్ యాసిడ్ లక్షణం. భరించలేని నొప్పి ఉంటుంది. మోకాలు, మడమల్లో నొప్పి ఉంటే యూరిక్ యాసిడ్ సమస్య కావచ్చు. తరచూ ఒత్తిడికి లోనవడం కూడా యూరిక్ యాసిడ్ సమస్య లక్షణాల్లో ఒకటి. ఎక్కువగా ఒత్తిడి లేదా ఆందోళనకు గురవుతుంటే శరీరంలో యూరిక్ యాసిడ్ పేరుకుపోతున్నట్టు అర్ధం


3. స్థూలకాయం కూడా మరో కారణం కావచ్చు. బరువు ఎక్కువగా ఉన్నవారు లేదా స్థూలకాయంతో బాధపడుతున్నవారికి కూడా యూరిక్ యాసిడ్ సమస్య ఉంటుంది.


4. తినే భోజనం వల్ల కూడా యూరిక్ యాసిడ్ సమస్య రావచ్చు. రెడ్ మీట్ వంటి ఆహార పదార్ధాలతో యూరిక్ యాసిడ్ సమస్య ఏర్పడే అవకశాముంది.


5. జీవనశైలిలో మార్పులు అవసరం. మీ లైఫ్‌స్టైల్, ఆహారపుఅలవాట్లలో మార్పులు వస్తే..యూరిక్ యాసిడ్ సమస్య కావచ్చు


6. యూరిక్ యాసిడ్ సమస్యకు మరో ప్రధాన కారణం అనువంశికత. అంటే జీన్స్ కారణంగా ఈ సమస్య రావచ్చు. 


Also read: Heart Swelling: హార్ట్ స్వెల్లింగ్ అంటే ఏమిటి, లక్షణాలెలా ఉంటాయి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu      


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook