Cholesterol Control Tips: మీకు కొలెస్ట్రాల్ ఉందా..అయితే ఈ 4 తప్పులు అస్సలు చేయవద్దు

Cholesterol Control Tips: శరీరంలో కొలెస్ట్రాల్ పెరగడం వల్ల గుండెపోటు ముప్పు పెరుగుతుంటుంది. అందుకే కొలెస్ట్రాల్ విషయంలో నిర్లక్ష్యం మంచిది కాదు. కొలెస్ట్రాల్ సమస్య ఉన్నప్పుడు ఈ 4 వస్తువులు తక్షణం మానేయాల్సిందే..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 7, 2022, 06:53 PM IST
Cholesterol Control Tips: మీకు కొలెస్ట్రాల్ ఉందా..అయితే ఈ 4 తప్పులు అస్సలు చేయవద్దు

ప్రస్తుత బిజీ జీవితంలో కొలెస్ట్రాల్ సమస్య సాధారణమైపోయింది. చాలామంది కొలెస్ట్రాల్ బారిన పడి అనారోగ్యానికి గురవుతున్నారు. ఒక్క కొలెస్ట్రాల్ సమస్య ఎన్నో ఇతర సమస్యలకు కారణమౌతుంటుంది. 

ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టకపోవడ వల్ల వివిధ రకాల అనారోగ్య సమస్యలు వెంటాడుతుంటాయి. ఇందులో ముఖ్యమైంది కొలెస్ట్రాల్ సమస్య. అందుకే శరీరంలో కొలెస్ట్రాల్ అధికమైనప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకూడదంటారు వైద్యులు. ఈ పరిస్థితుల్లో మీరు చేసే 4 తప్పులు..హార్ట్ ఎటాక్, టైప్ 2 డయాబెటిస్, స్ట్రోక్ ముప్పుకు కారణమౌతాయి. ఇది ప్రాణాంతకం కావచ్చు. కొలెస్ట్రాల్ ఉన్నప్పుడు ఏ తప్పులు చేయకూడదో తెలుసుకుందాం.

కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు ఏ తప్పులు చేయకూడదు

స్మోకింగ్

మీ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే స్మోకింగ్ వెంటనే మానేయాలి. ఎందుకంటే స్మోకింగ్ చేస్తున్నప్పుడు శరీరంలో గుడ్ కొలెస్ట్రాల్ ఏర్పడటం ఆగిపోతుంది. చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది. ఫలితంగా హార్ట్ ఎటాక్ రావచ్చు. అందుకే కొలెస్ట్రాల్ ఉంటే కచ్చితంగా స్మోకింగ్ మానేయాలి.

జంక్ ఫుడ్ తినడం

మీ శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే..జంక్ ఫుడ్స్ తక్షణం మానేయాలి. ముఖ్యంగా పిజ్జా, మోమోజ్, చౌమీన్, బర్గర్ వంటి మైదా ఆధారిత జంక్ ఫుడ్స్  తక్షణం మానేయాలి. ఇది మీ ఆరోగ్యానికి నష్టం కల్గిస్తుంది. వీటితో పాటు ప్లోసెస్డ్ ఫుడ్, ప్యాకేజ్డ్ ఫుడ్స్, మాంసం కూడా కొలెస్ట్రాల్ పెరగడంలో కీలకపాత్ర పోషిస్తాయి. మెరుగైన ఆరోగ్యం కోసం ఇలాంటి పదార్ధాలు వెంటనే మానేయాలి.

మద్యం తాగడం

మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరం. ముఖ్యంగా కొలెస్ట్రాల్ ఉన్నప్పుడు అస్సలు తాగకూడదు. మద్యం అలవాటు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతుంది. ఫలితంగా ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపిస్తుంది. పిట్‌నెస్ కోసం వ్యాయామం అలవాటు చేసుకోవాలి.

వ్యాయామం చేయడం

మెరుగైన ఆరోగ్యం పొందాలంటే..రోగాల్నించి విముక్తి చెందాలంటే ప్రతిరోజూ 2 కిలోమీటర్ల వరకూ వాకింగ్ తప్పకుండా చేయడమే కాకుండా తేలికపాటి ఎక్సర్‌సైజ్ కూడా చేయాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది. శరీరం పనితీరు మెరుగుపడుతుంది. 

Also read: Thyroid Care Tips: థైరాయిడ్ నియంత్రణకు అత్యద్భుత ఔషధమిదే, కేవలం 21 రోజుల్లో ఫలితాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu      

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News