శరీరంలో అంతర్గతంగా జరిగే మార్పులు పలు అనారోగ్య సమస్యలకు దారితీస్తుంటాయి. సకాలంలో వాటిని గుర్తించగలిగితే వెంటనే చికిత్స సాధ్యమౌతుంది. ఇందులో భాగంగానే గురక, జలుబు, జ్వరం సమస్యలకు అత్యంత సులభమైన చిట్కా ఉంది.
పాతకాలంలో చాలా రకాల అనారోగ్య సమస్యల్ని సులభమైన చిట్కా వైద్యంతో నయం చేసుకునేవారు. ఇప్పటికీ కొంతమంది పెద్దలు అదే పద్థతి ఆశ్రయిస్తుంటారు. ఇందులో ఒకటి నెయ్యి వైద్యం. పాతకాలంలో చాలా రకాల సమస్యల్ని నయం చేసేందుకు నెయ్యి వాడేవారు. నెయ్యిని కేవలం పాదాల అడుగుభాగంలో రాస్తే చాలు..చాలా సమస్యలకు ఉపశమనం లభించేది. పాదం అడుగుభాగంలో నెయ్యి రాయడం వల్ల శారీరక, మానసిక ప్రయోజనాలున్నాయి. అందుకే ఆ ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.
పాదానికి నెయ్యి రాయడం వల్ల లాభాలు
1. ఒకవేళ మీరు మీ పాదం అడుగుభాగంలో నెయ్యి రాస్తుంటే అలసట దూరమౌతుంది. ఇలా చేయడం వల్ల అలసట దూరమై మంచి నిద్ర పట్టడమే కాకుండా...మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది.
2. పాదానికి నెయ్యి రాయడం వల్ల గురక సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. చాలామందికి గురక తీవ్ర ఇబ్బందిగా ఉంటుంది. గురక వల్ల ఇతరులకు కూడా ఇబ్బందే. రాత్రి నిద్రపోయేముందు పాదం అడుగుభాగానికి నెయ్యి రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల గురక సమస్య నుంచి విముక్తి లభిస్తుంది.
3. పాదం అడుగుభాగంలో నెయ్యి రాయడం వల్ల జలుబు, జ్వరం వంటి సమస్యలు దూరమౌతాయి. దీనికోసం నెయ్యిని స్వల్పంగా వేడి చేసి పాదం అడుగుభాగంలో రాయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల జలుబు, దగ్గు, జ్వరం తగ్గుతాయి.
4. బ్లడ్ సర్క్యులేషన్‌ను పెంచడంలో నెయ్యి అద్భుతంగా పనిచేస్తుంది. వారంలో కనీసం 2 సార్లు నెయ్యి రాయాల్సి ఉంటుంది. కాళ్ల నొప్పులు కూడా దూరమౌతాయి. నడుం నొప్పి కూడా తగ్గుతుంది.
5. మీ ఎముకల్ని పటిష్టం చేసేందుకు పాదం అడుగుభాగంలో నెయ్యి రాయాలి. ఇలా చేస్తే మంచి ఉపశమనం లభిస్తుంది.
Also read: Cholesterol Control Tips: మీకు కొలెస్ట్రాల్ ఉందా..అయితే ఈ 4 తప్పులు అస్సలు చేయవద్దు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook