Vitamin B12 Rich Foods: విటమిన్ బి12 శరీరంలో లోపిస్తే అలసట, బలహీనత, తిమ్మిరెక్కుతుండటం, తల తిరగడం వంటి సమస్యలు ఉత్పన్నం కావచ్చు. వీటితో పాటు జ్ఞాపకశక్తి కూడా తగ్గవచ్చు. అందుకే విటమిన్ బి12 అనేది శరీరానికి అత్యంత కీలకమైంది. ఈ సమస్యల కారణంగా మొత్తం దినచర్యపై ప్రభావం పడుతుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మనిషి శరీరంలో రెడ్ బ్లడ్ సెల్స్ నిర్మాణం, నాడీ వ్యవస్థ నిర్వహణ, డీఎన్ఏ సింథసిస్ లో విటమిన్ బి12 కీలక భూమిక పోషిస్తుంటుంది. ఇది లోపిస్తే అలసట, బలహీనతతో పాటు ఎనీమియా, డిప్రెషన్ కూడా ఉత్పన్నం కావచ్చు. సాధారణంగా విటమిన్ బి12 లోపం అనేది ఎక్కువగా శాకాహారుల్లోనూ, ల్యాక్టో శాకాహారుల్లోనూ కన్పిస్తుంటుంది. కారణంగా విటమిన్ బి12 ఎక్కువగా సహజసిద్ధంగా ఉండేది మాంసం, చేపలు, గుడ్లు, పాల ఉత్పత్తుల్లోనే. మరి శాకాహారుల పరిస్థితి ఏంటని ఆందోళన చెందవద్దు. కొన్ని శాకాహార పదార్ధాల్లో కూడా విటమిన్ బి12 పుష్కలంగా లభిస్తుంది. 


కొన్ని రకాల బ్రేక్‌ఫాస్ట్ పదార్ధాల్లో అంటే ఫోర్టిఫైడ్ పదార్ధాల్లో విటమిన్ బి12 ఎక్కువగా ఉంటుంది. కనీసం 2.5 మైక్రోగ్రాముల విటమిన్ బి12 ఉండే పదార్ధాలను ఎంచుకోవాలి. ఇక మష్రూంలో కూడా విటమిన్ బి12 అధికంగా ఉంటుంది. ముఖ్యంగా సూర్యరశ్మిలో కూడా విటమిన్ బి12 సహజసిద్ధంగా లభిస్తుంది. మష్రూంలో లభించే విటమిన్ బి12 వేర్వేరుగా ఉంటుంది. అంటుకే మష్రూం ఒక్కటే తింటే సరిపోదు. 


సోయా మిల్స్, టేఫూ వంటి సోయా ఉత్పత్తుల్లో విటమిన్ బి12 సమృద్ధిగా లభిస్తుంది. సోయా మిల్క్‌లో అయితే దాదాపుగా 1.5 మైక్రోగ్రాముల విటమిన్ బి12 ఉంటుంది. ఇది రోజువారీ అవసరాల్లో 60 శాతం ఉంటుంది. సోంపులో కూడా విటమిన్ బి12 పుష్కలంగా లభిస్తుంది. 


న్యూట్రిషనల్ ఈస్ట్ కూడా చాలా మంచిది. ఇందులో విటమిన్ బి12 పుష్కలంగా లభిస్తుంది. ఒక స్పూన్ ఈస్ట్‌లో దాదాపుగా 2.5 మైక్రోగ్రాముల విటమిన్ బి12 ఉంటుంది. ఇది రోజువారీ అవసరాల్లో 100 శాతం కంటే ఎక్కువే. ఏ రూపంలో తీసుకున్నా నష్టం లేదు. 


Also read: Yoga for Kidney Stones Problem: యోగాసనాలతో కిడ్నీలో రాళ్లు తొలగించవచ్చా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook