Weight loss Five diets that you shouldn’t try in 2022 : మరికొన్ని రోజుల్లో న్యూ ఇయర్ (New Year) వచ్చేస్తోంది. 2021 మాదిరిగా కాకుండా.. 2022లో ఫిట్‌నెస్‌ కోసం కచ్చితంగా డైట్ పాటించాలనుకునే వారు చాలా మందే ఉంటారు. అలాగే ఫిట్‌నెస్, హెల్త్‌ కోసం న్యూ ఇయర్ రిజల్యూషన్‌ కూడా ఇప్పటికే చాలా మంది తయారు చేసుకుని ఉంటారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జిమ్‌లలో కసరత్తులు చేసేసి 2022లో ఫిట్‌గా ఉండాలనుకుంటూ ఉంటారు. ఫిట్‌నెస్‌ కోసం ఎక్సర్‌‌సైజ్‌లు చేయడంతో పాటు మంచి డైట్ పాటించాల్సి ఉంటుంది. కొన్ని ఆహారాల వల్ల బరువు పెరిగే అవకాశం ఉంది. అలాంటి కొన్ని ఆహారాలకు దూరంగా ఉంటే మంచిది. అలాగే కొన్ని ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది. మరి ఆ ఫుడ్స్ ఏమిటో ఒకసారి చూడండి. 


యూఎస్ న్యూస్ & వరల్డ్ రిపోర్ట్ (U.S. News & World Report) చేపట్టిన ఒక అధ్యయనం ప్రకారం.. కొన్ని డైట్స్‌ ప్రకారం కొన్ని ఆహారాలకు దూరంగా ఉండడం మేలు. వచ్చే సంవత్సరంలో మీరు దూరంగా ఉండాల్సిన ఆహారాలు ఏమిటో ఒకసారి చూడండి.. దీంతో మీరు బరువును అదుపులో పెట్టుకునే అవకాశం ఉంటుంది. 


యాసిడ్ ఆల్కలీన్ డైట్ (​Acid alkaline diet)


యాసిడ్ ఆల్కలీన్ డైట్ పాటించాలి. కొన్ని రకాల ఫుడ్స్‌ ఎక్కువగా యాసిడ్ ఉత్పత్తి చేస్తుంది. ఉదాహరణకు బీఫ్ వంటివి ఆహారపదార్థాలతో ఇలా ఎక్కువగా జరుగుతుంది. అలాగే రోజూ మీరు తీసుకునే ఆహారంలో ఎక్కువగా చికెన్, మాంసం, పాలు, పాల పదార్థాల వంటివి ఉండకుండా చూసుకోండి. వీలైనంత వరకు ఎక్కువగా పండ్లు, విత్తనాలు, కూరగాయలను ఎక్కువగా మీ డైట్‌లో చేర్చుకుంటే మంచిది. 


సంతానోత్పత్తి డైట్ (Fertility diet)


కొన్ని రకాల ఆహారాల వల్ల మహిళల్లో సంతానోత్పత్తి పెరుగుతుంది. గుడ్ ఫ్యాట్స్, తృణధాన్యాలతో తయారైన ఆహారం తీసుకోవడం వల్ల కార్బోహైడ్రేట్స్ తగ్గుతాయి. అంతేకాదు  సంతానోత్పత్తిని పెంచుతాయి. ఆహారంలో తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉండండం వల్ల సులభంగా బరువు తగ్గొచ్చు. 


Also Read : India Omicron Update: దేశంలో పెరుగుతున్న ఒమిక్రాన్ సంక్రమణ, కొత్తగా ఎన్ని కేసులంటే



గ్లైసెమిక్-ఇండెక్స్ డైట్ (Glycaemic-index diet)


మీ రక్తంలోని చక్కెర స్థాయిలను బట్టీ ఆహారాన్ని ఎంచుకోవడం అనేది ఈ డైట్ ఉద్దేశం. గ్లైసెమిక్ ఇండెక్స్ స్కేల్‌ ఎక్కువగా ఉండే ఆహారాలలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి ఆహారం బ్లడ్‌లోని అధిక చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. దీంతో సులభంగా బరువు తగ్గడానికి అవకాశం ఉంటుంది. చాలా పండ్లలో గ్లైసెమిక్ ఇండెక్స్ స్కేల్‌ ఎక్కువగా ఉంటుంది. అలాంటి ఆహారం ఆరోగ్యానికి మంచిది. బరువును కూడా అదుపులో పెట్టుకోవచ్చు. 


యాంటీ-ఇన్‌ఫ్లామెంటరీ డైట్ (Anti-inflammatory diet)


ఈ డైట్ పాటించడం వల్ల శరీరంలో ఇన్‌ఫ్లామెంటరీ లెవెల్స్‌ఉ తగ్గించుకోవచ్చు. చేపలు, పండ్లు, కూరగాయలు వంటి ఆహారాల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు సమృద్ధిగా ఉంటాయి. అలాంటి ఆహారం తీసుకోవడం వల్ల శరీరంలో ఇన్‌ఫ్లామెంటరీ లెవెల్స్ తగ్గుతాయి. బరువు అదుపులో ఉంటుంది.


పాలియో డైట్ (​Paleo diet)


ఈ డైట్ ఇటీవల బాగా పాప్‌లర్ అయింది. ఈ డైట్ (Diet) ప్రకారం.. మాంసం, చేపలు, కూరగాయలు వంటి ఆహారాలు ఎక్కువగా తీసుకోవాలి. అలాగే ఎక్కువగా శుద్ధి చేసిన చక్కెర, ధాన్యాలకు దూరంగా ఉండాలి. ఈ డైట్ కూడా ఆరోగ్యానికి మంచిది.


Also Read : Cowin Registration: చిన్నారులకు కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ జనవరి 1 నుంచి షురూ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి