Moong Dal Soup Recipe: మనం సాధారణంగా ప్రతిరోజు వివిధ రకాల కూరగాయాలను ఉపయోగించి వంటలను తయారు చేస్తాము. అయితే మనం తరుచు వంటలో వాడే పెసరపప్పు ఆరోగ్యానికి ఎంతో మేలు కలిగిస్తుందని ఆరోగ్యనిపుణుల చెబుతున్నారు. అయితే పెసరపప్పుతో ప్రతిరోజు చేసే వంటలు కాకుండా ఈ సారి మీరు సూప్‌ను ట్రై చేయండి. ఈ దాల్‌ సూప్‌ను తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటాము. ముఖ్యంగా సీజన్‌లో వచ్చే జ్వరం, దగ్గు, తగ్గుతుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎంతో రుచిగా ఉండ‌డ‌మే కాకుండా శ‌క్తిని అందిస్తూనే పోష‌కాలు కూడా ఉన్నాయి.మీరు కూడా పెస‌ర‌ప‌ప్పుతో సూప్‌ను ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకొని ట్రై చేయండి


పెస‌ర ప‌ప్పు సూప్ త‌యారీకి కావాల్సిన ప‌దార్థాలు: 


పెసర పప్పు - 1 1/2 కప్పు (ముందు రాత్రి నానబెట్టాలి)
నీరు - 4 కప్పులు
జీలకర్ర - 1/2 స్పూన్
పసుపు - 1/4 స్పూన్
ఎండుమిర్చి - 2
ఉల్లిపాయ - 1 
టమోటా - 1 
కొత్తిమీర తునకలు - కొద్దిగా
ఉప్పు - రుచికి


పెస‌ర ప‌ప్పు సూప్‌ను త‌యారు చేసే విధానం:


ముందుగా ఒక గిన్నెలో పెసర పప్పును అరగంట పాటు నానబెట్టాలి. ఆ తరువాత కుక్క‌ర్ పెట్టి అందులో నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడ‌య్యాక అందులో జీలకర్ర, తురిమిన అల్లం వేయాలి.పెసరపప్పుని వేసి వేయించాలి. త‌రువాత అందులో క్యారెట్, గుమ్మడికాయ‌ ముక్కలని వేసి బాగా క‌ల‌పాలి. ఆ త‌రువాత అందులో కాస్త‌ నీళ్ళని పోసి మ‌రోసారి క‌లిపి కుక్కర్ మూత పెట్టేయాలి. రెండు విజిల్స్ వ‌చ్చే వ‌ర‌కు ఉడికించాలి. అందులో మిరియాలు, వాము, ఉప్పు, అల్లం పొడి వేసుకోవాలి. త‌రువాత దానిపై మెంతి కూర‌ను వేసి గార్నిష్ చేయాలి. ఇలా పెస‌ర‌ప‌ప్పుతో సూప్‌ను తీసుకోవడం వల్ల శరీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరిగి త్వ‌ర‌గా కోలుకుంటారు.  శీతాకాలంలో ఈ సూప్‌  ఎంతో మేలు చేస్తుంది. దీని తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటారు. 
Also Read Ragi Dibba Rotte: రాగి దిబ్బరొట్టెను బ్రేక్‌ఫాస్ట్‌గా తింటే బోలెడు ప్రయోజనాలు కలుగుతాయి!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter