Reasons for Hair Fall: ఆధునిక జీవనశైలిలో చాలా మంది జుట్టు రాలే సమస్యలతో బాధపడుతున్నారు. జుట్టు ఎక్కువగా రాలడం వల్ల తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అయితే ఈ సమస్య రావడానికి కొన్ని కారణాలు ఉన్నయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఆ కారణాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మహిళ్లలో స్ట్రోజ‌న్ హార్మోన్ త‌క్కువ‌గా ఉన్నపుడు, థైరాయిడ్ ఇతర కార‌ణాల వల్ల స్త్రీలల్లో జుట్టు ఎక్కువ‌గా ఊడిపోతుందని నిపుణులు  చెబుతున్నారు. మగవారిలో టెస్టోస్టిరాన్‌ అనే హార్మోన్‌ అధికంగా పెరగడం వల్ల జుట్టు ఊడిపోతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. అలాగే జుట్టు కుదుళ్లు బలహీనంగా ఉన్న జుట్టు రాలుతుంది. దీని కారణంగా బట్టతల వస్తుంది. అంతేకాకుండా తలలో బ్యాక్టీరియల్‌ ఇన్పెక్షన్‌ల వల్ల జుట్టు ఎక్కువగా రాలిపోతుంది. 


Also Read:  Weight Gaining: సన్నగా ఉన్నారా? చలి కాలంలో శరీర బరువు పెంచే పండ్లు ఇవే..


శరీరంలో పోష‌కాహార లోపించడం వ‌ల్ల కూడా జుట్టు ఎక్కువ‌గా ఊడిపోతుంది. ప్రోటీన్, విట‌మిన్ డి,ఇ, విట‌మిన్ బి12, ఐర‌న్ లోపాల‌తో  కూడా జుట్టు ఎక్కువ‌గా ఊడిపోతుంది.  ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు మందులు వాడ‌డం వ‌ల్ల వాటి ప్ర‌భావం వల్ల జుట్టు ఎక్కువ‌గా ఊడిపోతుంది. ముఖ్యంగా ఒత్తిడి, ఆందోళ‌న వంటి కార‌ణం వల్ల జుట్టు  ఊడిపోతుంది.


అలాగే శ‌రీరంలో డీహైడ్రేష‌న్ కార‌ణంగా  జుట్టు ఊడిపోతుంది. త‌గినంత నీరు తాగ‌క‌పోవ‌డం వల్ల కుదుళ్లు బ‌ల‌హీన‌ప‌డి జుట్టు విరిగిపోతూ ఉంటుంది.  వేడి నీటితో త‌ల‌స్నానం చేస్తూ ఉంటారు. ఇలా  వేడి నీటితో త‌ల‌స్నానం చేయ‌డం వ‌ల్ల జుట్టు ఊడిపోతుంది. 


జ‌న్యుప‌రంగా కూడా జుట్టు ఎక్కువ‌గా రాలిపోతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఈ విధంగా  జుట్టు ఎక్కువ‌గా ఊడిపోతుంద‌ని ఈ అల‌వాట్ల‌ను మార్చుకోవడం వల్ల మీ జుట్టు సమస్య తగ్గుతుంది.


Also Read: Mouth Function: ఆహారాన్ని ఎక్కువ నమిలి తినడం వల్ల శరీరానికి కలిగే లాభాలు ఏంటో మీకు తెలుసా ?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter